For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nani29: ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన నాని.. ప్రీలుక్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన స్టార్

  |

  స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే సహజ సిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిగిరి చూడకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మార్కెట్‌ను సైతం గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఇలా అతడు హీరోగా, నిర్మాతగా చిత్రాలు చేస్తూ హవాను చూపిస్తున్నాడు.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  చాలా కాలం పాటు వరుస విజయాలతో సత్తా చాటిన నేచురల్ స్టార్ నాని.. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు చిత్రాలను లైన్‌లో పెట్టడం.. వాటికి సంబంధించిన షూటింగ్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'టక్ జగదీష్' మూవీని పూర్తి చేసుకున్న అతడు.. ఇటీవలే దాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి కూడా గుమ్మడికాయ కొట్టేశాడు. ఇక, ప్రస్తుతం నాని చేతిలో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

  Nani 29th Film Announcement on October 15th

  వీటి తర్వాత నేచురల్ స్టార్ నాని చేయబోయే 29వ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాని తదుపరి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడని చాలా రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమా యుద్ధంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌తో పలు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  తాజాగా నాని తన 29వ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇందులో బ్లాక్ బ్యాగ్రౌండ్‌లో ఓ గూడ్స్ ట్రైన్ వెళ్తుండగా.. పక్కనే ఫ్యాక్టరీ నుంచి పొగ వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇది అప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించేసింది. ఇక, ఇందులోనే నాని 29వ సినిమాకు సంబంధించిన వివరాలు 15వ తేదీ మధ్యాహ్నం 1.53 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను సీఎల్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు తాజాగా వదిలిన పోస్టర్‌లో వెల్లడించారు.

  ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తన గెటప్‌ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని ఆ మధ్య జరిగిన 'టక్ జగదీష్' ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ప్రీ లుక్ పోస్టర్‌తోనే అతడు సర్‌ప్రైజ్ చేసేశాడు. ఇదే ఇలా ఉంటే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

  English summary
  Tollywood Star Hero, Natural Star Nani Now Busy with Few Movies. And Now he Tweet about his 29th Film Announcement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X