For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్స్‌కు నాని సర్‌ప్రైజ్: ఆ లోటును భర్తీ చేసేందుకు కీలక ప్రకటన చేయనున్న స్టార్

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్లాప్ అసిస్టెంట్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలో పలువురు దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత 'అష్టాచెమ్మా'తో హీరోగా మారాడు. మొదటి చిత్రమే సూపర్ హిట్ అవడంతో అతడు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. దీనికితోడు ప్రతి సినిమాను సహజ సిద్ధమైన నటనతో వన్ మ్యాన్ షోగా మార్చుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడీ టాలెంటెడ్ గాయ్.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  ఆ మధ్య వరుస విజయాలతో సత్తా చాటిన నేచురల్ స్టార్ నాని.. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు చిత్రాలను లైన్‌లో పెట్టడం.. వాటికి సంబంధించిన షూటింగ్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'టక్ జగదీష్' మూవీని పూర్తి చేసుకున్న అతడు.. ఆ వెంటనే 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి కూడా గుమ్మడికాయ కొట్టేశాడు. ఇక, ప్రస్తుతం నాని చేతిలో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

  Nani to Announce Gowtam Tinnanuri Movie in August

  ఇప్పటికే రెండు చిత్రాల షూట్‌ను పూర్తి చేసుకుని.. మరో సినిమా చిత్రీకరణలో పాల్గొంటోన్న నాని.. గతంలో తనకు 'జెర్సీ' వంటి భారీ హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరితో మరో సినిమాను చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా యుద్ధంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందట. అంతేకాదు, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌తో పలు భాషల్లో తెరకెక్కనుందనే టాక్ వినిపించింది.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  తాజా సమాచారం ప్రకారం.. గౌతమ్ తిన్ననూరితో నేచురల్ స్టార్ నాని చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన ఆగస్టులోనే రాబోతుందట. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు చాలా సమయం ఉన్నప్పటికీ.. దీన్ని ఈ నెలలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తుండడంతో నాని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ కారణంగానే వాళ్లను ఖుషీ చేయడానికి హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమాను ప్రకటించబోతున్నాడట నాని. మరి అది ఈ నెలలో ఏ రోజున రాబోతుందో అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

  Nani to Announce Gowtam Tinnanuri Movie in August

  ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి.. షాహీద్ కపూర్ హీరోగా 'జెర్సీ' హిందీ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తైంది. త్వరలోనే విడుదల కాబోతుంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంటనే ఈ యంగ్ డైరెక్టర్ నానితో సినిమాను మొదలు పెడతాడని తెలుస్తోంది. నాని మాత్రం ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమాను చేశాడు. ఇది వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

  English summary
  Tollywood Star Hero, Natural Star Nani Now Busy with Few Movies. Now He Linedup A Biopic Film Under Gowtam Tinnanuri Direction. Nani to Announce This Movie in August.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X