Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గౌరవంగా ఫీల్ అవుతున్నా.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తో నిఖిల్
నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ షూటింగ్ కోసం తెగ శ్రమిస్తున్నాడు. దేవాలయాలు, పురాతన సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాల మీద కార్తికేయ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కథాపరంగా సినిమాను ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా షూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లోని దర్శనీయ స్థలాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్తికేయ 2 టీంకు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి.
గత వారం కార్తికేయ 2 షూటింగ్‌లో భాగంగా నిఖిల్ గాయపడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా నిఖిల్ కాలికి గాయమైంది. అలా రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత వాతావరణంలోని మార్పు కారణంగా.. మంచు తుఫానులో టీం ఇరుక్కుపోయింది. షూటింగ్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎలాగోలా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. తాజాగా నిఖిల్ ఓ పోస్ట్ చేశాడు.

అలాంటి దట్టమైన మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ఎంతో సహకరిస్తోన్న బీఎస్ఎఫ్ అధికారులతో నిఖిల్ ముచ్చటించాడు. ముందుంటి మా టీంకు సాయం చేసినందుకు, షూటింగ్ సజావుగా జరిగేలా చూసినందుకు బీఎస్ఎఫ్ ఆఫీసర్లకు థ్యాంక్స్.. వారు ధరించే టోపీని నాకు ఇవ్వడం ఎంతో గౌరవంగా అనిపిస్తోంది.. ఇది నాకు మెమోరబుల్ డే.. అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.