టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్.. మరో హీరోతో కలిసి చేయనున్న నితిన్

By Manoj

చిన్న వయసులోనే భారీ విజయాలు సాధించాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు విజయాలను అందుకున్న నితిన్.. ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవి చూశాడు. ఇక, ఇష్క్ తర్వాత అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తర్వాత అతడు కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, నితిన్ నటించిన చివరి రెండు మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా నితిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

మూడు సినిమాలతో ఫుల్ బిజీ

మూడు సినిమాలతో ఫుల్ బిజీ

వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. వైవిధ్యమైన కథలకు ఓకే చెప్పినప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. దీంతో సరికొత్త కథలకు ఓకే చెబుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ‘భీష్మ', ‘రంగ్ దే', ‘చదరంగం' వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

అక్కినేని హీరోతో బెడిసి కొట్టింది

అక్కినేని హీరోతో బెడిసి కొట్టింది

నితిన్ హీరోగా సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగానూ పలు సినిమాలకు బాధ్యతలు నిర్వర్తించాడు. తన సినిమాలైన ‘గుండే జారి గల్లంతయ్యిందే', ‘చిన్నాదానా నీకోసం'తో పాటు అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్‌'ను కూడా అతడే నిర్మించాడు. ఈ మూడు సినిమాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టకపోగా, నష్టాలనే మిగిల్చాయి.

ఇప్పుడు మరో యంగ్ హీరోతో

ఇప్పుడు మరో యంగ్ హీరోతో

తాజాగా నితిన్ మరో సినిమాను నిర్మించాలనుకుంటున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోను తీసుకోవాలని అతడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. నూతన దర్శకుడితో ఈ కథను సిద్ధం చేయించినట్లు సమాచారం.

ఆ సినిమా రీమేకేనా..?

ఆ సినిమా రీమేకేనా..?

బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ‘అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమానే నితిన్ నిర్మించబోతున్నాడని తెలుస్తోంది.

Recommended Video

#CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
అతడే చేస్తాడనుకున్నారు

అతడే చేస్తాడనుకున్నారు

బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. అది మొదలు ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఈ రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. మాతృక నిర్మాతైన వయాకామ్ 18 తెలుగులోనూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుందట. మొదట ఈ సినిమాను నితినే చేస్తాడనుకున్నారు. కానీ, అతడికి కమిట్‌మెంట్స్ ఉండడంతో మరో హీరోను ట్రై చేస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X