Don't Miss!
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- News
భారత్-పాక్ అణుయుద్ధం అలా అడ్డుకున్నా-తాజా పుస్తకంలో ట్రంప్ కేబినెట్ మంత్రి సంచలనం..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
తన రికార్డును తానే బ్రేక్ చేసిన నితిన్: హిట్ మూవీ కంటే ఎక్కువ కొట్టిన ‘రంగ్ దే’
గత ఏడాది 'భీష్మ'తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం అతడికి అంతగా కలిసి రావడం లేదు. దీనికి కారణం ఇప్పటికే ఈ యంగ్ హీరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన 'చెక్' కాగా.. ఇంకోటి వెంకీ అట్లూరి తీసిన 'రంగ్ దే'. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. దీంతో అతడు తీవ్ర నిరాశకు లోనవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఓ విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'రంగ్ దే' చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన దక్కలేదు. కానీ, జీ5 ఓటీటీలో మాత్రం ఇది సూపర్ హిట్ అయింది. అలాగే, తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. దీనికి బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు 7 పైచిలుకు రేటింగ్ వచ్చింది. తద్వారా తన గత చిత్రం 'భీష్మ' పేరిట ఉన్న రేటింగ్ రికార్డు (6.65)ను బ్రేక్ చేశాడు. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీతో పాటు బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను అందుకోవడం పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది.

ఇదిలా ఉండగా.. నితిన్ ప్రస్తుతం 'మాస్ట్రో' అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అతడు అంధుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అలాగే, అత్యంత ముఖ్యమైన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించనుంది. ఇది నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది.