పవన్ కొత్త సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్: ఒక్కటి కూడా లేకపోతే వర్కౌట్ అవుతుందా!

సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమా ప్రారంభం అవడానికి ముందే పలు చిత్రాలను ప్రకటించాడాయన. దీంతో ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ మధ్య ప్రకటించిన ఓ సినిమాను అన్నింటి కంటే ముందే మొదలు పెట్టాడు. అదే.. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మల్టీస్టారర్‌గా వచ్చి మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఉండదట. ఎంతో సీరియస్‌గా సాగే ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

No Songs in Pawan Kalyans Ayyappanum Koshiyum

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నప్పటికీ.. అది కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మాత్రమేనని అంటున్నారు. ఇద్దరు హీరోలు కావడంతో.. రెండు డిఫరెంట్‌ బీజీఎమ్స్ రెడీ చేస్తున్నాడట ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇక, ఈ సినిమాకు మాటల మాంత్రికుడు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X