Don't Miss!
- News
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆ ప్లాట్ల కేటాయింపుపై కీలక పాయింట్
- Sports
IND vs NZ: మూడేళ్ల తర్వాత సెంచరీ.. ఇక దబిడి దిబిడే అంటున్న రోహిత్ ఫ్యాన్స్!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కు రెడీగా మరో హిట్ మూవీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఖుషి సినిమాతో మరోసారి అర్థమయింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు విడుదలైన కొన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా ఊహించని విధంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మళ్లీ రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. రి రిలీజ్ అనే అనే ట్రెండులో ఈ సినిమా మరో సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది.
ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఖుషి మొదటి సినిమాగా నిలిచింది. అయితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్న మరికొన్ని సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేయాలి అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ మొదట్లో అద్భుతమైన విజయాలను అందుకున్న చాలా సినిమాలు కూడా ఇప్పటికే థియేటర్లలో సందడి చేశాయి.

ఇంతకుముందు విడుదలైన జల్సా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ మధ్య తమ్ముడు బద్రి సినిమాలను కూడా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఖుషి తరహాలోనే తొలిప్రేమ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరిర్ లో చాలా మంచి విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా యూత్ కు పవన్ కళ్యాణ్ ను మరింత దగ్గరగా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ లవ్ స్టోరీలలో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఈ ఈ లవ్ స్టోరీని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే హడావుడిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక పవన్ నుంచి నెక్స్ట్ హరిహర వీరమల్లు అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.