పవన్ కల్యాణ్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్.. అదే రిపీట్ అయితే ఓజీ ఫలితం ఇక అంతే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ను చాలా భిన్నంగా కొనసాగించారు. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు 30 వరకు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక 1996 నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు. ఆయన కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న చిత్రాలు అనడం కంటే ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్న పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తూ వచ్చింది.

మరోవైపు ఆయా చిత్రాలు యావరేజ్, ఎబో యావరేజ్ ఆడిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతూ వస్తుండటం సినీ ప్రముఖులను, విశ్లేషకులను ఒక దశలో ఆశ్చర్యపరిచింది. కేవలం 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగారు. అప్పటి నుంచి రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ప్రతి సినిమాలో యువతకు స్ఫూర్తినిచ్చేలా పాటలు, సోసైటీలోని పలు అసమానతలను ఎత్తిచూపుతూనే ప్రేక్షకులను అలరించారు. ఇలా వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

Pawan Kalyan Creating History for Every 12 Years

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు తన సినిమాల విషయంలో ఒక సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ హీరోగా తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ వెంటనే గోకులంలో సీత, సుస్వాగతం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తొలిప్రేమతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమ్ముడు, బద్రి వంటి చిత్రాలతోనూ హిట్స్ అందుకున్నారు. ఇక 2001లో ఖుషి చిత్రంతో ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ పేరు మారుమోగేలా చేశారు.

ఖుషి చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయా సినిమాలు క్రియేట్ చేసిన హైప్ ను క్రియేట్ చేయలేకపోయాయి. బాలు, జల్సా వంటి చిత్రాలు హిట్ గా నిలిచాయి. మిగితావి పెద్దగా ఆకట్టుకోలేదు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంతో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. గబ్బర్ సింగ్ తో హిట్ అందుకున్న అది రీమేక్ మూవీ కావడం విశేషం. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు OG తో పవన్ కళ్యాణ్ గత వైభవాన్ని చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలైన రేంజ్ ఏంటో OG చిత్రంతో ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కనిపిస్తుండటం విశేషం.

అయితే పవన్ కళ్యాణ్ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి హిస్టరీ క్రియేట్ చేసే సినిమాతో వస్తున్నారు. ఖుషి, అత్తారింటికి దారేది, OG చిత్రాలకు 12 ఏళ్ల గ్యాప్ ఉండటం విశేషం. ఇదే సెంటిమెంట్ నిజమైతే ఇక OG ఇండియాలో, ఓవర్సీస్ లో అన్ని రికార్డును కొల్లగొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక OG చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో గ్రాండ్ గా విడుదల అవుతోంది. మరికొన్ని గంటల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og movie tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X