twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సన్నాసి మంత్రికి చెప్పండి.. అక్కడ కొట్టుకొనేందుకుకా? రిపబ్లిక్ వేడుకలో పవన్ కల్యాణ్ ఆగ్రహం

    |

    సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన తేజ్ హాస్పిటల్‌లో ఉండగా, ఆ సినిమాకు అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. ఈ వేడుకలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలను వెల్లడిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడుతూ..

    అతడే.. ఆ సన్నాసి మంత్రే అంటూ

    అతడే.. ఆ సన్నాసి మంత్రే అంటూ

    చిత్ర పరిశ్రమలో 25 వేల మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. పవన్ కల్యాణ్‌పై కోపంతో సినిమాలను ఆపేస్తే.. లక్ష మంది పొట్టకొడుతున్నారు. నాపై కోపం ఉంటే నా సినిమాలను ఆపేయండి. అక్కడ ఏపీలో మంత్రి ఉన్నారు. ఆయన పేరు ఏమిటంటే... పక్కనే ఉన్న వ్యక్తి ఆ మంత్రి పేరు చెప్పారు. అతడే ఆ సన్నాసే అంటూ పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిపై ఘాటుగా స్పందించారు.

    చిరంజీవితో సోదరభావమా?

    చిరంజీవితో సోదరభావమా?

    ఆ సన్నాసి మంత్రి అనే మాట ఏమిటంటే.. మా నాయకులకు చిరంజీవి అంటే సోదరభావం అంటూ మాట్లాడాడు. ఉపయోగపడని.. సినీ పరిశ్రమకు అక్కరలేని సోదరభావం ఎందుకు.. దిబ్బలో కొట్టుకొనేందుకా? అని ఘాటుగా ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎలాంటి వారంటే.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని వదలకుండా నీచంగా మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై మాటల దాడి చేశారు. వందల కోట్ల సినిమా పరిశ్రమ అంటే వారికో లెక్కనా? ఆ సన్నాసి మంత్రితో మీటింగ్ పెట్టుకొన్నారు కదా.. ఆ సన్నాసికి చెప్పండి.. పవన్ కల్యాణ్ సినిమాను ఆపేసే.. మిగితా వారిని వదిలిపెట్టండి అని అన్నారు.

    మా సినిమాలను ఎవడు ఆపుతాడురా?

    మా సినిమాలను ఎవడు ఆపుతాడురా?

    అయితే మన సినిమాలను ఆపేస్తే ఎలా అంటే.. మన సినిమాలను ఎవడు ఆపుతాడురా.. ఆపితే మనం ఊరుకొంటామా? గొడవ పడటానికే సిద్ధపడి ఈ రోజు ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో 1200 సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. ఇక థియేటర్ మెయింటెన్ చేయడానికి 25 మంది పనిచేస్తారు. ఒక పవన్ కల్యాణ్‌పై కోపంతో వారి పొట్టకొడుతున్నారు. ఇక సినిమా నుంచి ఆదాయం .. మీరు కాంట్రాక్టులపై సంపాదించగలరు. వాటికి మీరు ట్యాక్స్ కూడా కట్టరు. ప్రతీ ఒక్కరు దేవ కట్టా మాదిరిగా ధైర్యంగా మాట్లాడాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

    గుండాలకు, రాజకీయ నేతలకు భయపడొద్దు

    గుండాలకు, రాజకీయ నేతలకు భయపడొద్దు

    ప్రతీ ఒక్కరికి భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కు కల్పించింది. అందరూ ధైర్యంగా మాట్లాడాలి. లేస్తే నేను మనిషి కాదు అనే వారికి.. గుండాలకు, రాజకీయ నేతలకు భయపడవద్దు. భారత రిపబ్లిక్ ఇచ్చిన హక్కు అది అని పవన్ కల్యాణ్ అన్నారు. నన్ను పవర్ స్టార్ అంటూ సుమ అన్నారు. పవర్ లేని వాడిని పవర్ స్టార్ అని పిలిస్తే లాభం ఏమిటి అని తనపై తాను సెటైర్లు వేసుకొన్నారు.

    సినిమా వాళ్లు కట్టే ట్యాక్స్ గురించి తెలుసా?

    సినిమా వాళ్లు కట్టే ట్యాక్స్ గురించి తెలుసా?

    సినిమా వాళ్ల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నారని వైసీపీ వాళ్లు అంటుంటారు. ఒరేయ్ సన్నాసుల్లారా.. దద్దమ్మల్లారా.. ఇక సినిమాకు పది కోట్లు తీసుకొంటే.. 10 శాతం ట్యాక్స్ కట్ చేస్తారు. అప్పుడు ఇంకా టాక్సులు కట్ చేస్తే చేతికి 6.5 కోట్లు వస్తాయి. సినిమా వాళ్లు కప్టపడి ప్రతిఫలం తీసుకొంటున్నారు. మీ మాదిరిగా అక్రమంగా కాంట్రాక్టులు, ఇతర మార్గాల మాదిరిగా సంపాదించడం లేదు అంటూ పవన్ కల్యాణ్ ఘాటుగా సంపాదించారు.

    ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రాంచరణ్ అంటూ..

    ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రాంచరణ్ అంటూ..

    సినిమా హీరోలకు కోట్లు ఇస్తున్నారంటే.. ప్రభాస్, రానా కండలు పెంచితే.. అది బాహుబలి అయింది. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సుల చేసి కష్టపడితే.. అతడికి రెమ్యునరేషన్ ఇస్తారు. అలాగే రాంచరణ్ గుర్రపు స్వారీ చేస్తే అతడికి కోట్లు ఇస్తారు. అంతేకానీ మీలాగా అక్రమంగా వేలకోట్లు సంపాదించడం లేదు. మీరు ఇలానే వ్యవహరిస్తే.. కుర్రాళ్లు కామెడీగా చంపేస్తారు అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. సినిమా వాళ్లపై కాదు.. రాజకీయాల్లో అక్రమంగా ఆర్జిస్తున్న నాయకులపై దృష్టిపెట్టాలి అని పవన్ కల్యాణ్ సూచించాడు.

    English summary
    Power Star Pawan Kalyan made speech at Republic movie pre release event. targets Ap Minister Nani Alla and Ap Government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X