twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒళ్లు గగుర్బొడిచే ఫీట్ చేసిన అభిమాని.. వీడియో చూసి లారెన్స్ అప్‌సెట్, వద్దంటూ రిక్వెస్ట్!

    |

    Recommended Video

    Raghava Lawrence Request Fan About Hanging From Crane To Pour Milk On Poster || Filmibeat Telugu

    రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంచన సిరీస్ చిత్రాలకు మంచి ఆదరణ ఉండటంతో తాజాగా కాంచన-3 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కామెడీ, హారర్ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

    తమిళనాడులో లారెన్స్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాంచన-3 రిలీజ్ సందర్భంగా వివిధ రకాలుగా తమ అభిమానం ప్రదర్శించే పనులు చేశారు. అందులో ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన లారెన్స్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    వీడియో చూసి లారెన్స్ అప్ సెట్, వద్దంటూ రిక్వెస్ట్

    వీడియో చూసి లారెన్స్ అప్ సెట్, వద్దంటూ రిక్వెస్ట్

    ప్రాణాలను రిస్కులో పెట్టి సదరు అభిమాని చేసిన ఈ చరక్యను చాలా మంది ఖండించారు. ఈ వీడియో లారెన్స్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా అప్‌సెట్ అయ్యారు. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని రిక్వెస్ట్ చేశారు.

    ఈ విధంగా మీ ప్రేమను చూపాల్సిన అవసరం లేదు

    ఈ విధంగా మీ ప్రేమను చూపాల్సిన అవసరం లేదు

    ‘‘డియర్ ఫ్యాన్స్, ఫ్రెండ్.. మీ అందరినీ వేడుకుంటున్నాను. నా అభిమానుల్లో ఒకరు క్రేన్ మీద వేలాడుతూ నా పోస్టర్‌పై పాలాభిషేకం చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా బ్యాడ్‌గా ఫీలయ్యాను. అలాంటి రిస్క్ ఎవరూ చేయవద్దని అందరినీ సిన్సియర్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా మీ ప్రేమను చూపాల్సిన అవసరం లేదు.'' అని లారెన్స్ ట్వీట్ చేశారు.

    మీ కోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తోంది

    మీ కోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తోంది

    ‘‘మీ కోసం ఇంటి వద్ద ఎదురు చూసే ఫ్యామిలీ ఉంటుంది. ఏ పని చేసేప్పుడైనా ఆ విషయం మైండ్‌లో పెట్టుకోండి. నాపై ప్రేమను పంచి, అభిమానిని అని నిరూపించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి రిస్కీ చర్యలను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను.'' అన్నారు.

    అలా చేస్తే సంతోషపడతాను

    అలా చేస్తే సంతోషపడతాను

    నాపై అభిమానం చూపాలనుకుంటే... స్కూలు ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు సహాయం చేయండి. చాలా మంది వృద్ధులు తిండిలేక కష్టపడుతున్నారు. వారికి ఫుడ్ అందించి హెల్ప్ చేయండి. ఇలాంటి పనులు నన్ను మరింత సంతోష పెట్టడంతో పాటు నా అభిమానులు ఈ పని చేశారని గర్వపడతాను.

    మీ జీవితం చాలా ముఖ్యమైందని

    క్రేన్ మీద వేలాడుతూ చేసే రిస్కీ పనులను నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. అలాంటి పనులు మళ్లీ ఎవరూ చేయరని నమ్ముతున్నాను. మీ జీవితం చాలా ముఖ్యమైందని, ఏ పని చేసేప్పుడైనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని లారెన్స్ అభిమానులను వేడుకున్నారు.

    English summary
    "He wrote, "Dear fans and friends, this is a humble request to all my fans. I saw a video with one of my fan hanging in a crane and doing milk abhisegam for my banner. I felt very bad after watching that video. My sincere request to all my fans, please do not take such risks.(sic)" Raghava Lawrence tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X