For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas's Adipurush ఆగస్టు 11న ప్రభంజనం .. డేట్ గుర్తుంచుకోండి.. ఒంగోలు నుంచి ఓవర్సీస్ వరకు రచ్చే

  |

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందే డేట్ ప్రకటించిన దర్శకుడు ఓం రావత్ తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను గుర్తు చేశాడు. సినిమా యూనిట్ రిలీజ్ డేట్ లక్ష్యాన్ని అందుకోవడానికి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. దాంతో ఆదిపురుష్ మరోసారి మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చనీయాంశమైంది. ప్రభాస్ స్టామినా, రేంజ్ గురించి నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆదిపురుష్ రిలీజ్ గురించి.. ప్రభాస్ రికార్డుల గురించి వివరాల్లోకి వెళితే..

  ప్యాన్ ఇండియా హీరోగా ప్రభాస్

  ప్యాన్ ఇండియా హీరోగా ప్రభాస్

  బాహుబలి తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్‌కు కింగ్‌లా మారాడు. దాదాపు ఆరు రాష్ట్రాల్లో వసూల్ రాజా అవతారం ఎత్తాడు. సినిమా హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రభాస్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రంతో ఉత్తరాదిలో మరోసారి తన స్టామినాను ఎస్టాబ్లిష్ చేశాడు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా ప్రభాస్ సినిమాకు కలెక్షన్లు చెక్కు చెదర్లేకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది.

  ఆరు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్‌తో

  ఆరు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్‌తో

  ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ప్రభాస్‌కు విశేషమైన మాస్ ఫాలోయింగ్ ఉందనే విషయం స్పష్టమైంది. గత చిత్రాల కలెక్షన్లు పరిశీలిస్తే మహరాష్ట్రలో 200 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో 200 కోట్లు, తమిళనాడులో 150 కోట్లు, కర్ణాటకనలో 130 కోట్లు, తెలంగాణలో 115 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ ఘనతను సాధించాడు.

  ఆగస్టు 11న ఆదిపురుష్ రిలీజ్

  ఆగస్టు 11న ఆదిపురుష్ రిలీజ్

  ఇంతటి స్టామినా ఉన్న ప్రభాస్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ జత కట్టి ఆదిపురుష్ సినిమాను రూపొందించడంతో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. ఈ సినిమాను 2022 ఆగస్టు 11 తేదీన రిలీజ్ చేయాలని ముందే టార్గెట్ సెట్ చేశాడు. ఆగస్టు 11వ తేదీ మరో సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలువబోతుందనే విషయం హైలెట్‌గా మారింది. అంటే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజు బాక్సాఫీస్ బద్దలు కావడం తథ్యం అనే విశ్వాసాన్ని ఆది పురుష్ టీమ్ వ్యక్తం చేస్తున్నది.

  ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనమే

  ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనమే

  ఆది పురుష్ రిలీజ్ అయ్యే డేట్ 11-8-2022ను బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సెంటర్ల నుంచి డీ సెంటర్ల వరకు.. అమలాపురం నుంచి ఆహ్మదాబాద్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు, ఒంగోలు నుంచి ఓవర్సీస్ వరకు అంతా ప్రభాస్ నామస్మరణే.. ఆదిపురుష్ మూవీ ప్రభంజనమే ఉంటుుంది అంటూ నెటిజన్లు ట్వీట్లతో ట్రెండ్ చేస్తున్నారు.

  పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే.. రచ్చే

  పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే.. రచ్చే

  దేశవ్యాప్తంగా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే ఆదిపురుష్ చిత్రం సరికొత్త చరిత్రకు నాంది పలకబోతుందనే విషయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా ఆదిపురుష్ నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవుని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 11వ తేదీన ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ మరోసారి జరగబోయే బాక్సాఫీస్ విధ్వంసాన్ని గుర్తు చేశారు.

  వాల్మికీ రామయాణం ఆధారంగా ఆదిపురుష్

  వాల్మికీ రామయాణం ఆధారంగా ఆదిపురుష్

  హిందు పురాణాల్లో అద్బుతంగా వాల్మికి రచించిన రామాయణం కథా నేపథ్యంగా ఆదిపురుష్ తెరకెక్కుతున్నది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడుగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు.

  Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
  నటీనటులు

  నటీనటులు

  ప్రభాస్, కృతిసనన్, సైఫ్ ఆలీఖాన్, సన్నీ సింగ్, దేవ్‌దత్తా నాగే, తృప్తి తోడర్‌మల్, వత్సల్ సేథ్ తదితరులు
  దర్శకుడు: ఓం రావత్
  నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
  సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని
  ఎడిటింగ్: అపూర్వ మోతివాలే, ఆశీష్ మాత్రే
  మ్యూజిక్: సాచెత్ పరంపర
  బ్యానర్: టీ సీరిస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్
  రిలీజ్ డేట్: 2020-08-11

  English summary
  Prabhas's Adipurush release date tranding on twitter. Aadipurush is set to release on August 11, 2022. Exactly after one year, this movie is set release worldwide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X