ప్రాణ స్నేహితుడి కోసం అలా ప్లాన్ చేసిన ప్రభాస్.. ఎలాగైనా అతనికి హిట్టు రావాలని..

ప్రభాస్ ను డార్లింగ్ అనడానికి కారణం అతని మంచి గుణమేనని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. పాన్ ఇండియా హీరో అయినా కూడా ఇంకా అదే వినయంతో ఉంటాడు. వీలైనంత వరకు తన క్లోజ్ ఫ్రెండ్స్ తో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరితో డార్లింగ్ ఇంకా అదే పాజిటివ్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నాడు.

సొంత ప్రొడక్షన్ లో..

సొంత ప్రొడక్షన్ లో..

ఇక ప్రభాస్ తన స్నేహితులకు ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికి తెలిసిందే. ఎవరు ఎలాంటి సహాయం కోరినా కూడా బిజీగా ఉన్నా సరే వారికోసం హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు. ఇటీవల కాలంలో ప్రభాస్ యువ హీరోలకు కూడా హెల్ప్ చేసేందుకు సొంత ప్రొడక్షన్ లో అవకాశాలు కూడా ఇప్పిస్తున్నాడు.

గోపీచంద్ కోసం ప్రభాస్..

గోపీచంద్ కోసం ప్రభాస్..

ఇక గోపిచంద్ ప్రభాస్ ఎంత మంచి స్నేహితులో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు ఇద్దరు ఒకే స్వభావం కలిగిన డార్లింగ్స్ అని చెప్పవచ్చు. అయితే గోపిచంద్ ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ అందుకోవడం లేదు. వరుస అపజయాలు గోపిచంద్ మార్కెట్ ను చాలానే దెబ్బ కొట్టాయి. దీంతో ప్రభాస్ రంగంలోకి దిగినట్లు టాక్ వస్తోంది.

కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్.. అదిరిపోయే షాట్స్ ఇవే

మారుతి ప్రాజెక్ట్ వెనుక ప్రభాస్..

మారుతి ప్రాజెక్ట్ వెనుక ప్రభాస్..

ఎప్పటికప్పుడు ప్రభాస్ గోపిచంద్ సినిమాలపై చర్చలు జరుపుతూనే ఉంటాడట. అయితే వరుస అపజయాల అనంతరం గోపి కాస్త డీలా పడడంతో ప్రత్యేకంగా ఒక దర్శకుడిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. మారుతి. ఇటీవల గోపీచంద్ తో ఈ దర్శకుడు సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

జిల్ సినిమా కూడా..ప్రభాస్ కారణంగానే..

జిల్ సినిమా కూడా..ప్రభాస్ కారణంగానే..

అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి అసలు కారణం ప్రభాస్ అని తెలుస్తోంది. గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ సినిమా చేయడానికి కారణం కూడా డార్లింగ్ అని గోపీచంద్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఆ సినిమా తరువాత చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ తో రాధేశ్యామ్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సీటిమార్ తరువాతే..

సీటిమార్ తరువాతే..

ఇక చాలా కాలం తరువాత మళ్ళీ మారుతి, యూవీ క్రియేషన్స్ ను ఒకటి చేసి తన మిత్రుడి కోసం ఒక హిట్టు ప్రాజెక్టును ప్లాన్ చేసినట్లు సమాచారం. చూస్తుంటే ఈ సారి గోపి మరొక హిట్ అందుకునేలా ఉన్నాడని చెప్పవచ్చు. సీటిమార్ అనంతరం మారుతి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ బి స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక సినిమాకు 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X