Just In
- 39 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 2 hrs ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 2 hrs ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ డేరింగ్ స్టెప్: సినిమా టైటిల్ మార్చేసిన యంగ్ రెబెల్ స్టార్.. కొత్త పేరు అదిరిపోయిందిగా.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ సూపర్ సక్సెస్ అయ్యాడు. దీంతో ప్రభాస్ స్టార్ హీరో అయిపోయాడు. ఇక, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత అతడి కెరీర్ అమాంతం మారిపోయింది. ఈ నేపథ్యంలో అతడు ఓ డేరింగ్ స్టెప్ వేశాడు. ఇంతకీ ఏంటా స్టెప్.? వివరాల్లోకి వెళితే....

నష్టాలు వచ్చినా ప్రభాస్‌కు మాత్రం లాభమే
గత ఏడాది ప్రభాస్ ‘సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుజిత్ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. అయితే, ఈ మూవీ ప్రభాస్‌కు మాత్రం లాభాలనే చేకూర్చింది. దీని వల్ల హిందీలో అతడి మార్కెట్ పెరగడంతో పాటు అక్కడ కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి.

సరికొత్త ప్రయోగం.. ఇది కూడా ఆ రేంజ్‌లోనే
‘సాహో' వంటి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీనికి ‘జాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు. పూర్తి రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

ఎన్నో లీకులు.. అసలుది మాత్రం సస్పెన్స్
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంతో వస్తుందని, ఇందులో ప్రభాస్ దొంగగా నటిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నారు. మరోవైపు, కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పోస్టర్‌తో మరిన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీంతో సినిమాపై ఆసక్తి క్రమంగా పెరిగిపోతోంది.

ప్రభాస్ టీమ్‌కు షాకిచ్చిన నిర్మాత దిల్ రాజు
ప్రభాస్ నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జాన్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 96 తెలుగు రీమేక్‌కు ‘జాను' అనే టైటిల్ పెట్టారు. ఇది ప్రభాస్ సినిమాకు అనుకున్న టైటిల్‌లానే ఉండడంతో చిత్ర యూనిట్‌కు షాక్ తగిలినట్లైంది. సమంత - శర్వానంద్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా టైటిల్ మార్చేసిన యంగ్ రెబెల్ స్టార్
96 రీమేక్ మూవీ ‘జాను' టైటిల్ వల్ల తమ సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారో.. మరే కారణమో తెలియదు కానీ... ప్రభాస్ మూవీ టైటిల్ మార్చేశారని తాజాగా ఓ వార్త లీక్ అయింది. నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ ఇప్పటికే ఫిల్మ్ చాంబర్‌లో కొత్త టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయించిందని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ డేరింగ్ స్టెప్.. కొత్త పేరు అదిరిపోయిందిగా.!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కొత్త చిత్రానికి ‘ఓ డియర్' అనే టైటిల్ పెడుతున్నారట. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రభాస్ అండ్ టీమ్ ఈ టైటిల్‌ను ఫైనల్ చేయడంతో పాటు రిజిస్టర్ చేయించిందని తెలుస్తోంది. దీంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఈ టైటిల్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు.