Just In
- 2 min ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 58 min ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 1 hr ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
- 2 hrs ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంట్రెస్టింగ్: వంద కోట్ల డీల్‌ను పక్కన పెట్టేసిన ప్రభాస్.. అందుకే వాటి గురించి ప్రకటించలేదట.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. అతడి పాపులారిటీ మాత్రం దేశ వ్యాప్తం అయిపోయింది. దీనికి కారణం ఇటీవల అతడు నటించిన సినిమాలే. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' వల్ల ప్రభాస్ పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'సాహో' కూడా అతడి మార్కెట్‌ను భారీగా పెంచేసింది. దీంతో అతడితో సినిమా చేయడానికి చాలా మంది క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ వంద కోట్ల డీల్‌ను కాదనుకున్నాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. వివరాలు...

హిట్ టాక్ రాకున్నా రికార్డులు బద్దలు కొట్టాడు
ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి'తో మిగిలిన ఇండస్ట్రీల్లోనూ అతడి క్రేజ్ పెరిగింది. అయితే, ‘సాహో' సినిమా వల్ల యంగ్ రెబెల్ స్టార్ మార్కెట్ మాత్రం రెట్టింపు అయిందనే చెప్పాలి. ఈ సినిమా టాక్ బాగోకున్నా.. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీలో 2019లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

సరికొత్తగా కనిపించాలని ఆయనతో కలిశాడు
ఇప్పటికే ప్రభాస్ చాలా రకాల జోనర్లు ట్రై చేశాడు. ప్రస్తుతం అతడు ప్యూర్ రొమాంటిక్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. అదే.. ‘జాన్' (వర్కింగ్ టైటిల్). రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇది పాతకాలం నాటి ప్రేమకథగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది.

చిన్నగే అనుకున్నారు.. ఇప్పుడు పెంచేశారు
‘సాహో'కు భారీగా ఖర్చు చేయడంతో నష్టాలు మిగిలాయి. దీంతో ‘జాన్'కు బడ్జెట్ తగ్గించాలని ప్రభాస్ అనుకున్నాడని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే, రోజులు గడిచిన కొద్దీ దానికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయడంతో పాటు, దీనిని కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సినిమా కథ ఇదే.. ప్రభాస్ క్యారెక్టర్ ఇలానే
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ పూర్వ జన్మల నేపథ్యంతో సాగుతుందని అంటున్నారు. అందులో ప్రభాస్ ఒక పాత్రలో దొంగగా కనిపిస్తాడని, పాతకాలం నాటి వాహనాలను దొంగిలిస్తుంటాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇందులో ప్రభాస్ తండ్రి కొడుకుగా కనిపిస్తాడని చెబుతున్నారు.

వంద కోట్ల డీల్‌ను పక్కన పెట్టేసిన ప్రభాస్
తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. టాలీవుడ్‌లోని రెండు బడా నిర్మాణ సంస్థలు (చెరో రూ. 50 కోట్లు) ప్రభాస్‌కు రూ. 100 కోట్లు ఆఫర్ చేశాయట. తమ బ్యానర్‌లో సినిమా చేయాలని సదరు సంస్థల అధినేతలు కథలతో సహా ప్రభాస్ ఇంటికి వచ్చారట. కానీ, అతడు మాత్రం ఈ రెండు డీల్స్‌ను పక్కన పెట్టేశాడని సమాచారం.

అందుకే వాటి గురించి ప్రకటించలేదట.!
తన దగ్గరకు వచ్చిన ఆ ఇద్దరు నిర్మాతలకు ప్రభాస్ సినిమాలు చేస్తానని హామీ అయితే ఇచ్చాడని కూడా అంటున్నారు. కానీ, డీల్‌పై సంతకం మాత్రం చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘జాన్' రిలీజ్ అయిన తర్వాతనే ఆ సినిమాలకు సంబంధించన ప్రకటన చేయాలని ఓ కండీషన్ పెట్టాడట. అందుకే ఆ సినిమాల వివరాలు బయటకు రాలేదని వినికిడి.