Just In
- 15 min ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 1 hr ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
Don't Miss!
- News
50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ తర్వాతి సినిమాపై క్లారిటీ.. ‘మహా’ డైరెక్టర్ చెప్పిన కథకు యంగ్ రెబెల్ స్టార్ ఫిదా.!
దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న తెలుగు హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'ఈశ్వర్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, 'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో'తో తన స్టామినాను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇక, తాజాగా ప్రభాస్ తదుపరి సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

సినిమా హిట్ కాకున్నా సత్తా చూపించాడు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘సాహో'. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. అయితే, హిందీలో మాత్రం ప్రభాస్ మూవీ సత్తా చాటింది. ఈ క్రమంలోనే 2019లో అత్యధిక వసూళ్ల సాధించిన సినిమాగా నిలిచింది.

సరికొత్త ప్రయోగం చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్
‘సాహో' తర్వాత ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 1960 దశకం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

పునర్జన్మలు.. దొంగ.. అదిరిపోయే రొమాన్స్
ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని అంటున్నారు. అలాగే, ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని, అందులో ఒకటి దొంగ క్యారెక్టర్ అనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పూజా హెగ్డేతో అతడు అదిరిపోయే రొమాన్స్ చేశాడని తెలుస్తోంది.

ముందు అనుకున్న దానిని మార్చేశారు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘జాన్' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, సమంత - శర్వానంద్ కాంబోలో వచ్చిన 96 రీమేక్ మూవీకి ‘జాను' అనే పేరు పెట్టడంతో దీనిని మార్చాల్సి వచ్చింది. దీంతో యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ మూవీ కోసం ‘ఓ డియర్', ‘రాధే శ్యామ్' అనే టైటిళ్లను ఫిల్మ్ చాంబర్లలో రిజిస్టర్ చేసింది. వీటిలో ఒక దానిని ఫిక్స్ చేయనున్నారు.

ఎంతో మంది దర్శకులు.. ఎవరు చేస్తున్నారు.?
దీని తర్వాత ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న దానిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, ఎస్ ఎస్ రాజమౌళి సహా పలువురు బాలీవుడ్ దర్శకులతో అతడు సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ మామూలు పుకార్లు గానే మిగిలిపోయాయి.


ప్రభాస్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది
ప్రభాస్ తదుపరి సినిమాపై తాజాగా ఓ వార్త లీక్ అయింది. దీని ప్రకారం... ‘మహానటి' వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌తోనే అతడు సినిమా చేయబోతున్నాడట. రెండు రోజుల క్రితం నాగ్ అశ్విన్.. ప్రభాస్‌కు ఓ కథను వినిపించాడని, దానికి యంగ్ రెబెల్ స్టార్ ఫిదా అయిపోయాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.