Don't Miss!
- News
గోరఖ్‌నాథ్ ఆలయంలో కత్తితో దాడికి పాల్పడిన దోషికి మరణశిక్ష
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Unstoppable With NBK 2: ప్రభాస్ షర్ట్ పైనే అందరి ఫోకస్.. దాని ధర ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ షో మరో రేంజ్ కి వెళ్లే ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది. నెవర్ బిఫోర్ అనేలా ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ఒక స్టార్ హీరో టాక్ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ షోకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ షర్ట్ పైన అందరి ఫోకస్ పడింది. ఇక షర్ట్ కు సంబంధించిన ధర కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక షర్ట్ ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

మనసువిప్పి మాట్లాడిన
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత తన పర్సనల్ లైఫ్ విషయాలను బయట చెప్పుకుంది చాలా తక్కువ. ఇక అతని జీవితంలోనే ఎన్నో ఎమోషనల్ విషయాలు కూడా ఫాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ టాక్ షో లో మాత్రం ప్రభాస్ విషయాలపై మనసు విప్పి మాట్లాడినట్లు తెలుస్తోంది.

గోపిచంద్ కూడా
ప్రభాస్ తో పాటు అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా మొత్తం పూర్తయింది. నందమూరి బాలకృష్ణ ఎన్నో పర్సనల్ విషయాలతో పాటు ఎన్నో ఎమోషనల్ విషయాలపై కూడా ప్రభాస్ గోపీచంద్ లతో చర్చించారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయం గురించి కూడా ప్రభాస్ సరదాగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ స్మార్ట్ లుక్
ఇక మొత్తానికి ఈ షో ఎలా ఉంటుంది అనే విషయంలో అయితే క్యూరియాసిటీ హై రేంజ్ లో పెరిగిపోతుంది. ఫ్యాన్స్ అయితే ఎప్పుడు ఎప్పుడు ఈ షో చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఈ షోలో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే అతని చివరి సినిమా రాదే శ్యామ్ లో కూడా ప్రభాస్ అంతా బాగా అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అతను చాలా స్మార్ట్ గా ఉన్నాడు అంటూ ఫాన్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఫ్యాన్స్ ఫోకస్ పడింది
ఇక ప్రభాస్ ఈ షోలో ధరించిన షర్ట్ పై కూడా అందరి ఫోకస్ పడింది. చాలా కలర్ఫుల్ గా ప్రత్యేకంగా ఉండడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ షర్ట్ ధర ఎంత ఉంటుందా అని వెతికే పనిలో కూడా పడ్డారు. సాధారణంగా ప్రభాస్ బయట షూటింగ్ లేనప్పుడు కూడా సింపుల్ గా ఉండేది ప్రయత్నిస్తాడు. కానీ బాలయ్య షోలో మాత్రం క్లాస్ స్టైల్ లో చాలా స్మార్ట్ గా కనిపించాడు.

షర్ట్ ధర ఎంతంటే..
అది పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్ అని తెలుస్తోంది.. ఇక దీని ధర సుమారు రూ. 11,618/- అని సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ప్రభాస్ వేసుకున్నందుకు ఆ షర్ట్ ధర మరింత పెరిగినా.. పెరగవచ్చు అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఆ కలర్ ఫార్మాట్లో ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మరికొన్ని సంస్థలు తక్కువ ధరకు తీసుకురావచ్చు అని తెలుస్తోంది.