For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Salaar మూవీలో మరో స్టార్ హీరో: సాలిడ్ క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ

  |

  కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుని హవాను చూపించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ బడా హీరో.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రభాస్.. తన మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు.

  డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు చిత్రాలను ప్రకటించి మాంచి ఊపులో ఉన్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు.

  Prithviraj Sukumaran Clarity about Salaar Movie

  దేశమే మెచ్చిన ఇద్దరు స్టార్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా నటించబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అలా ఈ సినిమా కోసం బాగా హైలైట్ అయిన స్టార్లలో మలయాళ బడా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని అతడే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, అనివార్య కారణాల వల్ల ఇందులో తాను నటించడం లేదని కూడా అతడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి అతడు మరో వార్తను చెప్పాడు.

  శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

  హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న 'సలార్' మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడట. తాజాగా అతడు ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఓ మీడియా సమావేశంలో అతడు 'గతంలో నా సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సలార్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. ప్రభాస్, ప్రశాంత్ స్వయంగా అడిగినా కాదన్నాను. అయితే, ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నేను మళ్లీ ఈ సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటున్నాను. దీంతో ఈ విషయాన్ని ప్రశాంత్‌కు వెల్లడించాను. దీనికి అతడు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు నన్ను ఇందులో భాగం చేశాడు' అని చెప్పుకొచ్చాడీ స్టార్ హీరో.

  భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  English summary
  Prabhas Doing Salaar Movie under Prashanth Neel Direction. Recently Prithviraj Sukumaran Gave Clarity about This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X