పుష్ప రాజ్ మరొక రికార్డు: మాస్టర్ కంటే ముందుగా.. RRR కంటే వేగంగా
ఐకాన్ స్టార్ గా కొత్త ట్యాగ్ తో రాబోతున్న అల్లు అర్జున్ పుష్పతో మరొక కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త లుక్కుతో దర్శనమిస్తున్న ఈ స్టార్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టీజర్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఆడియెన్స్ ను అంచనాలకు మించి థ్రిల్ చేశారని టాక్ అందుకుంటోంది.

కేవలం తెలుగులోనే కాకుండా
ఇక 24గంటల్లో పుష్ప టీజర్ నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ కెరీర్ లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ రేంజ్ లో వైరల్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ మొత్తంలో కూడా అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా పుష్ప రాజ్ న్యూ యూ ట్యూబ్ రికార్డును క్రియేట్ చేశాడు.

24గంటల్లో..
సౌత్ లో ఇంతవరకు 24గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ లలో పుష్ప సెకండ్ ప్లేస్ లో నిలిచింది. KGF చాప్టర్ 2 68.83 మిలియన్ల వ్యూవ్స్ తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత పుష్ప రాజ్ 22.52మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ఇక మూడవ స్థానంలో విజయ్ మాస్టర్ టీజర్ 24గంటల్లో 19.36మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది.

టాలీవుడ్ నెంబర్ వన్ టీజర్
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే 24గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న సినిమాల్లో పుష్ప రాజ్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 22మిలియన్ల వ్యూవ్స్ తో టాప్ లో కి చేరుకుంది. ఆ తరువాత స్థానాల్లో సరిలేరు నీకెవ్వరు 14.64మిలియన్ల వ్యూవ్స్, రామరాజు ఫర్ భీమ్ RRR టీజర్ 14.4మిలియన్ల వ్యూవ్స్, సాహో టీజర్ 12.94మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి.
Recommended Video

క్లారిటీగా అర్ధమయ్యింది
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బజ్ ఏ రేంజ్ లో ఉందొ టీజర్ తో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. సినిమా కోసం మొదటిసారి ఈ సంస్థ భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది.


Click it and Unblock the Notifications











