twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దానగుణంలో అందరు స్టార్లను మించిపోయాడు... కేరళకు లారెన్స్ విరాళం ఎంతో తెలుసా?

    By Bojja Kumar
    |

    వరదలతో అతలాకుతలం అయిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే వరద నష్టం మాత్రం భారీగా ఉంది. ప్రకృతి ప్రకోపానికి లక్షల మంది ప్రభావితం అయ్యారు. వేల మంది తమ ఇళ్లను కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వరుణుడి బీభత్సానికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, స్వచ్ఛమైన నీరు దొరకక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్లు, ప్రజలు తమ వంతు సహయంగా విరాళాలు ప్రకటించడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

    మన తెలుగు నుండి పలువురు కొందరు హీరోలు రూ. 5 లక్షలు మొదలుకుని రూ. 25 లక్షల వరకు డొనేషన్స్ ఇచ్చారు. సౌతిండియా మొత్తంలో తమిళ స్టార్ విజయ్ ఇప్పటి వరకు అత్యధికంగా రూ. 70 లక్షల సహాయం అందించారు. అయితే తాజాగా హీరో, దర్శకుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఏకంగా రూ. 1 కోటి విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

    రూ. 1 కోటి అందిస్తున్నట్లు ట్వీట్ చేసిన లారెన్స్

    రూ. 1 కోటి అందిస్తున్నట్లు ట్వీట్ చేసిన లారెన్స్

    కేరళకు రూ. 1 కోటి సహాయం అందించబోతున్నట్లు లారెన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. కేరళకు కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. కేరళలో ఉన్న మన సోదరులు, సోదరీమణులు వరదల వల్ల ఎంతో కోల్పోయారు. వారికి సహాయం చేయాలనుకుంటున్నాను.' అని ట్వీట్ చేశారు.

    స్వయంగా వెళ్లి సేవ

    స్వయంగా వెళ్లి సేవ

    అక్కడి పరిస్థితులను చూశాక సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలని, ప్రజలకు నేరుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజుల ముందే వెళ్లాలనుకున్నాను. కానీ వర్షాల కారణంగా అక్కడ రావొద్దని చెప్పారు. ఇపుడు వర్షాలు తగ్గాయి కాబట్టి స్వయంగా ప్రభుత్వ అధికారులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని తెలిపారు.

    సీఎంను కలుస్తాను

    కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అపాయింట్మెంట్ శనివారం దొరికింది. ఆ రోజు నేరుగా ఆయన్ను కలిసి విరాళం అందజేస్తాను. ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతాను. కేరళను ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని రాగవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను అని లారెన్స్ వెల్లడించారు.

    ఇప్పటి వరకు ఎవరు ఎంత ఇచ్చారు?

    ఇప్పటి వరకు ఎవరు ఎంత ఇచ్చారు?

    తమిళ స్టార్ విజయ్: రూ. 70 లక్షలు
    చియాన్ విక్రమ్: రూ. 35 లక్షలు

    రూ. 25 లక్షలు

    చిరంజీవి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్, కమల్ హాసన్, అల్లు అర్జున్, సూర్య- కార్తి కలిసి, మమ్ముట్టి- దుల్కర్ సల్మాన్ కలిసి, విజయ్ సేతుపతి, మహేష్ బాబు, ప్రభాస్.

    రూ. 10 లక్షలు

    జయం రవి, ఏఆర్ మురుగదాస్, ఉపాసన, కళ్యాణ్ రామ్, దిల్ రాజు, సిద్ధార్థ్, శివకర్తికేయన్ , నయనతార, విశాల్ , ఉదయనిధి స్టాలిన్.

    నాగార్జున, భార్య అమల 28 లక్షలు, షారుఖ్ ఖాన్: రూ. 21 లక్షలు, కీర్తి సురేష్: రూ. 15 లక్షలు, రజనీకాంత్: 15 లక్షలు, ధనుష్ రూ. 15 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, రామ్ రూ. 5 లక్షలు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్: రూ .5 లక్షలు, కొరటాల శివ రూ. 3 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ. 1 లక్ష.

    English summary
    Raghava Lawrence has pledged to donate Rs 1 crore to the relief works of flood-hit Kerala. "Hi Friends and Fans..! I have decided to contribute "1 crore to Kerala". I'm feeling very disheartened that it has been destroyed by flood and people suffering a lot they are like our brothers and sisters." hava Lawrence tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X