Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Raids on Shah Rukh Khan's Mannat: ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కీలక ప్రకటన.. షారుక్ ఫ్యాన్స్‌కు ఊరట
ముంబై గోవా క్రూయిజ్‌లో రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 3న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కోసం షారుక్ ఖాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో షారుక్ ఖాన్‌కు ఎన్సీబీ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ వివారాల్లోకి వెళితే..

షారుక్ ఖాన్‌కు అండగా శివసేన
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత షారుక్ ఖాన్‌కు పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు సంఘీభావం ప్రకటించారు. శివసేన పార్టీ నేతలు ఆయనకు అండగా నిలుస్తున్నారు. షారుక్ ఖాన్‌పై బీజేపీ ప్రతీకారం తీర్చుకొంటున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి విమర్శలకు తలవొగ్గకుండా ఎన్సీబీ డ్రగ్స్ కేసు విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్నది.

సమీర్ వాంఖడే భార్యను వివాదంలోకి లాగుతూ
ఇక ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే వ్యక్తిగత జీవితాన్ని కూడా సినీ, రాజకీయ వర్గాలు టార్గెట్ చేసుకొన్నాయి. సమీర్ వాంఖడే భార్య క్రాంతి రేద్కర్ ప్రభావం ఆయనపై ఉంది. తన భార్య సినీ పరిశ్రమలో రాణించలేకపోవడానికి జీర్ణించుకోలేకపోయిన సమీర్ వాంఖడే.. బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపించాయి. ఇలాంటి క్రమంలో సమీర్ వాంఖడే బృందం మరోసారి కొరడా ఝులిపించిందనే వార్త మీడియాలో వైరల్ అయింది.

ఎన్సీబీ అధికారులు మన్నత్‌లోకి
ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే షారుక్ నివాసం మన్నత్‌లోకి ఎన్సీబీ అధికారులు అధికారికంగా ప్రవేశించారు. మన్నత్‌లోకి ఎన్సీబీ అధికారులు చేతిలో పేపర్లు, డాక్యుమెంట్లు పట్టుకొని వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షారుక్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లి తన కుమారుడిని పరామర్శిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయనే వార్తలు జాతీయ మీడియాలో హైలెట్ అయ్యాయి.

కొన్ని ప్రొటోకాల్స్ పాటిస్తున్నాం అంటూ ఎన్సీబీ
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత చట్ట ప్రకారం జరగాల్సిన కొన్ని చర్యలను పాటిస్తున్నాం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఎవరైనా వ్యక్తి ఇంటిలోకి గానీ, ఆయన ఉండే ప్రదేశానికి వెళ్లడం వల్లన సదరు వ్యక్తి నిందితుడు కాదు. అది కేవలం విచారణలో ఓ భాగం. కొన్ని ప్రొసీజర్లను మేము ఫాలో అవుతున్నాం అని షారుక్ ఖాన్ నివాసంపై దాడులు నిర్వహించడంపై అధికారి వివరణ ఇచ్చారు.

షారుక్ నివాసంపై దాడులు చేయడం లేదు
అయితే షారుక్ ఖాన్ నివాసం మన్నత్‌పై దాడులు జరుగుతున్నాయనే వార్తను ముుంబై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కీలక ప్రకటన చేశారు. ఆర్యన్ ఖాన్‌కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకోవడానికే షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లాం. ఆయన నివాసంపై ఎలాంటి దాడులు చేయడం లేదు అని సమీర్ వివరణ ఇచ్చారు.
Recommended Video

బాంబే హైకోర్టులో పిటిషన్
ఇదిలా ఉండగా, అక్టోబర్ 20న బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో గురువారం ఆయన తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి శుక్రవారం లేదా సోమవారం విచారించాలని కోర్టును వేడుకొన్నారు.
వాస్తవానికి అక్టోబర్ 26వ తేదీన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్నట్టు బాంబే కోర్టు తేదీని ప్రకటించింది. ఈ క్రమంలోనే సతీష్ మాన్‌షిండే అభ్యర్థన పిటిషన్‌ను దాఖలు చేశారు.