మొదటిసారి రూటు మార్చిన రాజ్ తరుణ్.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో న్యూ మూవీ
కెరీర్ మొదలైనప్పుడు ఒక సక్సెస్ వస్తే ఏ హీరో అయినా సరే వరుసగా ఆఫర్లు అందుకోవాదం సహజమే. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందితే ఇక వారికి ఇండస్ట్రీలో ఒక మార్కెట్ సెట్టయినట్లే అని చెప్పవచ్చు. అయితే ఎంతో కష్టపడి పైకొచ్చిన రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఈ మధ్య వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్నాడు. అలాగే చేసిన సినిమాలు కూడా థియేటర్స్ వరకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
లాక్ డౌన్ కారణంగా రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగా సినిమా వాయిదా పడుతూ చివరికి ఓటీటీలోనే విడుదలైంది. ఇక ఆ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలోనే 'పవర్ ప్లే' అనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. రొటీన్ సినిమాలను పక్కనపెట్టి అల్లరి నరేష్ తరహాలో డిఫరెంట్ గా ట్రై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. మొదటిసారి ఈ లవర్ బాయ్ త్రిల్లర్ కథను టచ్ చేస్తున్నాడు.

థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో హేమాల్, పూర్ణ, అజయ్, కోట శ్రీనివాసరావు వంటి వారి నటిస్తుండగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ జానర్ లో రాజ్ తరుణ్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











