గ్లోబల్ స్టార్ ట్యాగ్ వద్దు... రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?
చిత్ర పరిశ్రమలో నటీనటులకు బిరుదులు ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు అందరికీ ఏదో ఒక ట్యాగ్ ఉంటూనే ఉంది. హీరోలు, హీరోయిన్లకే కాదు.. దర్శకులు, నిర్మాతలు, కమెడియన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ట్యాగ్స్ ఉన్నాయి. పలువురు హీరో, హీరోయిన్లకు ఒకటికి మించి బిరుదులు ఉండేవి. ఇక తరంలోని హీరోలకు కూడా యంగ్ టైగర్, ప్రిన్స్, యంగ్ రెబల్ స్టార్, ఎనర్జిటిక్ స్టార్, పవర్ స్టార్, స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ వంటి బిరుదులు ఉన్నాయి. మీడియా సంస్థలు, అభిమానులు వీటిని ఇస్తే.. కొందరు స్టార్స్ మాత్రం తమకు తామే ఇచ్చుకుంటూ ఉంటారు.
విమర్శలు ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ
ట్యాగ్ లైన్స్ విషయంలో పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి. స్టార్ హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి చిత్రం మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాతి నుంచి ఆయనను రౌడీ బాయ్, రౌడీ స్టార్ అని పిలుచుకున్నారు అభిమానులు. అక్కడి వరకు బాగానే ఉండగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సమయంలో తన పేరు ది విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ కనిపించడంతో ఆయన పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో తన పేరుకు ముందు ది అనే ట్యాగ్ తీసేయమని అభిమానులకు సూచించారు విజయ్.

గ్లోబల్ స్టార్‌గా క్రేజ్
ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. ఫైట్స్, డ్యాన్స్, నటన ఇలా అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని.. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ తన మార్కెట్, క్రేజ్ పెంచుకున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలతో ఆయన గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్‌ను అందరూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో పిలవడం మొదలుపెట్టారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ టైటిల్ కార్డ్స్‌లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉపయోగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చరణ్ తన ట్యాగ్‌ను మార్చేశారు.
వచ్చే ఏడాది పెద్ది
ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యెందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ లుక్‌తో పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్
ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీన చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ అనే రోల్ పోషిస్తున్నారని తెలిపింది. ఈ పోస్టర్‌తో పాటు నిర్మాణ సంస్థ పెట్టిన పోస్ట్‌లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్‌కి బదులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని కనిపించడం మెగా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే చరణ్ అనుమతితోనే వృద్ధి సినిమాస్ ఇలా పోస్ట్ పెట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది మాత్రం తెలియరాలేదు. అయితే గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ ట్యాగ్ బాగుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











