twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేబులో చిల్లిగవ్వ లేకుండా.. పెదనాన్న బర్త్ డే రోజున రామ్ ఎమోషనల్ ట్వీట్

    |

    యంగ్ అండ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనికి పెదనాన్న స్రవంతి రవికిషోర్ అంటే మాటల్లో చెప్పలేనంత, గుండెలో దాచుకొనేంత అభిమానం. పెదనాన్న అంటే ఓ ఇన్సిపిరేషన్, గైడ్, ఫిలాసఫర్‌గా భావిస్తుంటారు. తాజా తన పెదనాన్న అంటే ఎంత గౌరవమో మరోసారి రామ్ తన ట్విట్టర్‌లో చాటుకొన్నారు.

    జూలై 11వ తేదీ స్రవంతి రవి కిషోర్ బర్త్ డే. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్‌గా స్పందిస్తూ.. జేబులో చిల్లిగవ్వ లేకుండా సినిమాను ఎలా నిర్మించవచ్చో ఆయన చూపించారు. నీలో సినిమా తీయాలనే తపన ఉంటే చాలూ.. ఈ రోజుల్లో కూడా అది సాధ్యమేనని నిరూపించారు. నీలో తపన ఉంటే.. లక్ష్మీ నీ వెంట అడుగులు వేస్తుంది అనే జీవిత సత్యాన్ని ఆయన నుంచే నేర్చుకొన్నాను. థ్యాంక్యూ పెద్దనాన్న గారు. హ్యాపీ బర్త్ డే అంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు.

     RAm POthineni emotional tweet on Sravanthi Ravi Kishore birthday

    ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరీ దర్శక, నిర్మాణ సారథ్యంలో రూపొందిన దేవదాస్ చిత్రం ద్వారా రామ్ పోతినేనిని తెలుగు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ కెరీర్‌ గ్రాఫ్‌ను రివ్వును దూసుకుపోవడంలో స్రవంతి రవికిషోర్ పాత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ప్రతీ అడుగులోనూ పెద్దనాన్న ఆసరా, అండగా ఉంటుందనే సత్యం. అందుకే పెదనాన్న అంటే రామ్‌కు మాటల్లో చెప్పలేనంత గౌరవం.

    ఇక స్రవంతి రవికిషోర్ చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లేడీస్ టైలర్ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత మహర్షి, పుష్పక విమానం, నాయకుడు, వారసుడొచ్చాడు, నువ్వే కావాలి నుంచి మొన్నీ మధ్య వచ్చిన గణేష్, ఎందుకంటే ప్రేమంట, మసాలా, రఘువరన్ బీటెక్, శివం, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాలను నిర్మించారు. ఇలాంటి ఎన్నో చిత్రాలు అందిస్తూ.. మరొన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఫిల్మీబీట్ కోరుకొంటున్నది. హ్యాపీ బర్త్ డే స్రవంతి రవికిషోర్ గారు..

    English summary
    Young and Energetic RAm POthineni emotional tweet on Sravanthi Ravi Kishore birthday. Ram wrote on twitter that, This person showed me that making a film with empty pockets is still possible if you have the Passion to make it happen..Passion leads-Money follows..one of the most important lessons I’ve learned.Thank you Pedananagaru & Happy Birthday!.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X