యూట్యూబ్‌లో రామ్ పోతినేని రికార్డుల పరంపర.. దక్షిణాదిలో ఏ హీరోకు దక్కని ఘనత
సిల్వర్ స్క్రీన్‌పైనే కాకుండా యూట్యూబ్‌లో కూడా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రచ్చ కొనసాగుతున్నది. ఆయన నటించిన చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డు వ్యూస్ సాధిస్తూ సంచలనం రేపుతున్నది. అయితే యూట్యూబ్‌లో ఏ హీరో సాధించనంతగా ఓ రికార్డును రామ్ పోతినేని సొంతం చేసుకొన్నది. యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన దక్షిణాదిలో తొలి హీరోగా రికార్డును క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో హవా కొనసాగిస్తున్న ఆయన చిత్రాలు ఇవే..

దేవదాస్ (హిందీలో సబ్ సే బడా దిల్‌వాలా) 32 మిలియన్లు
జగడం (హిందీలో డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్) 31 మిలియన్లు
ఆర్కేఆర్కే (నఫ్రత్ కి జంగ్) చిత్రం 16 మిలియన్లు
గణేష్ (హిందీలో క్షత్రియ ఏక్ యోధ) 207 మిలియన్లు
కందిరీగ (హిందీలో డేంజరస్ ఖిలాడీ 5) 25 మిలియన్లు
ఎందుకంటే ప్రేమంట (హిందీలో డేంజరస్ ఖిలాడీ 5) 12 మిలియన్లు
మసాలా (హిందీలో చీటర్ కింగ్) 50 మిలియన్లు
నేను శైలజ (ది సూపర్ ఖిలాడీ 3) 440 మిలియన్లు
ఉన్నది ఒకటే జీవితం (హిందీలో నంబర్ 1 దిల్‌వాలా) 317 మిలియన్లు
హలో గురు ప్రేమ కోసమే (హిందీలో దుమాదార్ ఖిలాడీ) 404 మిలియన్లు
హైపర్ (హిందీలో సన్నాఫ్ సత్యమూర్తి 2) 170 మిలియన్లు
ఇస్మార్ట్ శంకర్ (హిందీలో ఇస్మార్ట్ శంకర్) 255 మిలియన్లు
గత కొద్ది కాలంగా రామ్ పోతినేని హిందీ మార్కెట్ అనూహ్యంగా పెరిగిపోయింది. త్వరలో విడుదల కాబోతున్న రామ్ పోతినేని చిత్రం ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడుపోవడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
ఇక రామ్ కెరీర్ విషయానికి వస్తే.. ది వారియర్ తర్వాత బోయపాటి శ్రీనుతో జతకట్టనున్నారు. రామ్ కెరీర్‌లో ఆయనకు 20వ చిత్రం. ఈ క్రేజీ కాంబినేషన్‌కు హిందీ మార్కెట్‌లో భారీ రెస్సాన్ వస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











