RAPO19: రామ్ పోతినేని కఠిన నిర్ణయం.. రెండింటి కోసం రెండు రకాల బాడీతో!

ఆ మధ్య సినిమాల విషయంలో తడబడినప్పటికీ.. కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. ఈ మధ్య వచ్చిన 'రెడ్'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రాలు ఇచ్చిన జోష్‌లో మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ ప్రాజెక్టును సైతం ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రామ్ పోతినేని.. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఈ రెండింటి కోసం రెండు రకాల బాడీతో దర్శనమిస్తాడట. అంటే.. ఒక పాత్ర కోసం ఫిట్ బాడీతో.. మరో దాని కోసం కొంచెం బొద్దుగా ఉంటాడట. ఇలా ఒకే సినిమా కోసం రెండు రకాలుగా కనిపించడం కోసం అతడు కఠోరంగా శ్రమించబోతున్నాడని అంటున్నారు. ముందుగా ఫిట్‌గా ఉన్న పాత్రకు సంబంధించిన చిత్రీకరణనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Ram Pothineni Two Different Getups for Lingusamy Movie

ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావం పెరిగడంతో అది కాస్తా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే ఇది మొదలవుతుందని తెలుస్తోంది. ఇక, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X