Sai Pallavi వెన్నెల పాత్రను సాయిపల్లవి మాత్రమే చేయగలదు... ఆమెలో అలాంటి నిజాయితీ.. రానా ప్రశంసల వర్షం

విరాట పర్వం సినిమాలోని రవన్న పాత్రకు స్పూర్తి ఏమీ లేదు. కానీ వాస్తవ సంఘటనలు, వ్యక్తుల నుంచి స్పూర్తి పొంది చేసిన పాత్ర. రవన్న అనే వ్యక్తి వృత్తిరీత్యా డాక్టర్. కవిగా మారుతాడు. ఆ తర్వాత నక్సలైట్‌గా అవతారం ఎత్తుతాడు. ఓ డాక్టర్ ఎలాంటి పరిస్థితుల్లో నక్సలైట్‌గా మారాడు అనేది ఈ సినిమా కథ. రవన్న పాత్రకు స్పూర్తి వేణు ఊడుగుల. వేణు ఊడుగుల రైటింగ్ అద్భుతంగా ఉంది. రవన్న పాత్ర ఎవరైనా వెయ్యవచ్చు. కానీ వెన్నెల పాత్రను సాయిపల్లవి మాత్రమే చేయగలదు. సాయిపల్లవి హృదయంలో నిజాయితీ ఉంటుంది. అందువల్లే ఈ సినిమాలో అంత బాగా ఫెర్ఫార్మ్ చేయగలిగింది అని రానా దగ్గుబాటి పేర్కొన్నారు.

Rana Daggubati praises Sai Pallavi acting talent in Venu Udugulas Virata Parvam

విరాట పర్వం సినిమాలో కేవలం రవన్న, వెన్నెల పాత్రలే కాకుండా ప్రతీ పాత్రకు చాలా ప్రాధ్యాన్యం ఉంటుంది. ప్రతీ పాత్ర చెప్పే మాటలతో కథ వేగంగా ముందుకెళ్తుంది. ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు పాత్రలు చాలా బలమైనవి. విరాట పర్వం మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా. ఈ సినిమా స్టోరి.. వెన్నెల కథ అని రానా తెలిపారు.

ఒక ప్రపంచంలో, సమాజంలో ట్రావెల్ చేస్తుంటే.. రకరకాల పాత్రలు కనిపిస్తాయి. కానీ ప్రతీ కథకు విభిన్నమైన కోణం ఉంటుంది. లవ్ స్టోరి సినిమా చూస్తే.. హ్యాపీగా వెళ్తుంది. కానీ విరాట పర్వం లాంటి సినిమా చూస్తుంటే.. ఓ ఎమోషన్, భయంతో కథ సాగుతుంది. ఈ సినిమాకు డాని సాంచెజ్ లొపేజ్ సినిమాటోగ్రఫి చాలా బలం. దర్శకుడు వేణు ఊడుగుల, సినిమాటోగ్రఫర్ డాని సాంచెజ్ లొపేజ్ ఇద్దరు ఎమోషనల్. వారిద్దరి కెమిస్ట్రీ తెరపైన కనపడుతుంది అని రానా చెప్పారు. విరాట పర్వం సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ వెన్నెముక. అద్బుతమైన రీరికార్డింగ్‌ను ఇచ్చాడు. మంచి పాటలు కంపోజ్ చేశాడు. ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడనే విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు అని రానా చెప్పాడు.

నటీనటులు: సాయిపల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరి రావు, సాయిచంద్, నివేదా పేతురాజ్
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి, డీ సురేష్ బాబు
సినిమాటోగ్రఫి: డాీన సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-06-17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X