Don't Miss!
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Varudu Kavalenu నాగశౌర్య ఈజ్ బ్యాక్.. భీమ్లా నాయక్ నిర్మాత కోసం వచ్చా.. రానా దగ్గుబాటి
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ఈ నెల 29న రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రానా దగ్గుబాటి విడుదల చేసిన విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా రానా దగ్గుబాటి, హీరో నాగశౌర్య పంచుకొన్న విషయాలు వైరల్‌గా మారాయి.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నాగశౌర్యని చూస్తే రాముడు మంచి బాలుడు అన్న సామెత గుర్తొస్తుంది. ఈ సినిమా ట్రైలర్ బావుంది. థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావడంతో జోష్ పెరిగింది. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్‌బ్యాక్ అని చెప్పగలను. ఈ రోజు ఈ వేడుకకు ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు. మా 'భీమ్లా నాయక్' నిర్మాత నాగవంశీ కోసం వచ్చాను. యూనిట్ సభ్యులందరికీఆల్ ద బెస్ట్ అని అన్నారు.
చలో సక్సెస్ పార్టీలో సౌజన్య వచ్చి తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా'అని అడిగింది. లైన్ నచ్చి వెంటనే ఓకే చేశా. కథ వినగానే సూపర్‌హిట్ అని ఫిక్స్ అయ్యా. ఇలాంటి కథను ఎంత చెడగొట్టాలన్నా చెడగొట్టలేము. ఎందుకంటే పేపర్ మీద ఈ కథ హిట్. తెరపై కూడా అంతే హిట్ అవుతుందని చెప్పగలను. సితార బ్యానర్ నిర్మించడంతో చిన్న సినిమా కాస్త భారీ సినిమా స్థాయి పెరిగింది. చినబాబు గారు , నాగవంశీ గారు ఫలానా హీరోకి ఇంతే బడ్జెట్ పెట్టాలనుకునే నిర్మాతలు కారు. 'డబ్బు ఎలా రాబట్టాలి అనే దానికంటే కథకు ఎంత పెట్టాలి' అని ఆలోచన ఉన్న వారిని మేకర్స్ అంటారు. అలాంటి వారే చినబాబు గారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.
వరుడు కావలెను చిత్రానికి గణేష్ రావూరి చక్కని సంభాషణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం మా డివోపీ వంశీ పచ్చిపులుసు. ఆయన కెమెరా పనితనానికి నాతో నేనే లవ్‌లో పడిపోయా. విశాల్ చంద్రశేఖర్ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన రానా అన్నకి థ్యాంక్స్' అని అన్నారు.
రియల్ లైఫ్‌లో నేను కూల్‌గా ఉంటాను. వైఫ్ డామినేటింగ్ ఉన్నా నాకు పర్వాలేదు. కొన్ని విషయాల్లో అడ్జస్ట్ కాను. ఎక్కడ రివర్స్ అవ్వాలో అక్కడ అవుతాను. నా గత చిత్రానికి ఈ సినిమాకు పదహారు కేజీల వెయిట్ తగ్గాను. అదే పెద్ద యునీక్‌నెస్. చాలా క్లాసిక్ సినిమా ఇది. కుటుంబ సభ్యులంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగశౌర్య సమాధానమిచ్చారు.
నిర్మాత
నాగవంశీ
మాట్లాడుతూ..
సితారా
సంస్థ
ఫ్యామిలీ
ఎంటర్‌టైన్‌మెంట్స్
మీదే
ఎక్కువ
దృష్టి
పెడుతుంది.
మాకు
అవే
బాగా
కలిసొచ్చాయి.
ఇది
ఫ్యామిలీ,
కమర్షియల్
సినిమా.
సెకెండాఫ్‌లో
ఒక
సస్పెన్స్
ఉంది.
అది
యూత్‌కి
బాగా
కనెక్ట్
అవుతుంది
అని
అన్నారు.