twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఖిలాడీ’ విషయంలో రవితేజ పునరాలోచన: ప్రయత్నాలు మొదలెట్టిన యూనిట్

    |

    'క్రాక్'తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ జోష్‌లోనే వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించాడు. ఇది చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటలీలో ఓ షెడ్యూల్‌ను మొదలెట్టారు. సరిగ్గా అప్పుడే కరోనా కలకలం రేగడంతో ఈ మూవీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. దీంతో ఆ సినిమాను అలాగే ఉంచేసి శరత్ మందవ డైరెక్షన్‌లో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. కొద్ది రోజులుగా దీని షూటింగ్ నిర్వరామంగా జరుగుతోంది.

    శరత్ మందవతో చేస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాతనే 'ఖిలాడీ'ని పున: ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. 'ఖిలాడీ' మూవీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించిందట. ఈ మేరకు ఇటలీ ప్రభుత్వం నుంచి పర్మీషన్ కోసం చర్యలు చేపట్టారని తెలుస్తోంది. ఒక్కసారి పర్మీషన్ దొరికితే దానిని పూర్తి చేసేస్తాడట రవితేజ. ఒకవేళ అనుమతి రాకపోతే దీన్ని కంటిన్యూ చేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ మాస్ హీరో రెండు సినిమాలపైనా ఫోకస్ చేస్తున్నాడన్న మాట.

    Ravi Tejas Khiladi Movie Shooting Starts From August

    క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

    English summary
    Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie Starts From August First Week. And Also This Film Release Date Announcement Coming Soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X