Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వేణుమాధవ్ ఇండియాలోనే టాప్.. ఆయన తొలి జీతం, మంచితనం తెలిస్తే షాకే
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి వార్త అన్ని వర్గాలను కలిచి వేస్తున్నది. ఆయన ఇక లేరనే వార్తను సినీ, రాజకీయ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత కొద్దికాలంగా కాలేయ, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్నాహ్నం వేణు మాధవ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన గురించి తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటంటే..

తొలి జీతం ఎంతో తెలుసా?
వేణు మాధవ్ గురించి చెప్పాలంటే, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అట్టడుగు స్థాయి నుంచి స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. తొలి నాళ్లలో మొదటి జీతం 600 రూపాయాలు తీసుకొన్నానని ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ చెప్పారు. అలాంటి స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తినా తన మూలాలను, ఇతర బాధలను మరిచిపోలేదు. అందుకు సాక్ష్యంగా నిలిచిన ఓ సంఘటనను నటుడు ఉత్తేజ్ పంచుకొన్నారు.

వైరల్‌గా ఉత్తేజ్ వీడియో
ఇక సోషల్ మీడియాలో నటుడు ఉత్తేజ్ వీడియో వైరల్‌గా మారింది. వేణు మాధవ్ మంచి తనానికి మారుపేరు అంటూ ఆయన చెప్పిన వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తున్నది. ఈ షూటింగ్ సందర్భంగా ఓ నటుడు వచ్చి వేణు మాధవ్‌ను సహాయం అడిగాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని, డబ్బు సహాయం చేయమని చెబితే.. వేణుమాధవ్ ఆయనకు భోజనం పెట్టారు. ఇక ఎలాంటి సహాయం చేస్తారనే ఎదురు చేస్తుంటూ కార్ డోర్ తెరిచి చూపిస్తే షాక్ తిన్నాను.

డబ్బు ఇస్తే తాగి తగిలేస్తాడని
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నటుడికి డబ్బు ఇస్తే రెండు రోజుల్లో తాగి తగిలేస్తాడు. కానీ భార్య, పిల్లల పరిస్థితి ఏమౌవుతుందో ఆలోచించావా? అందుకే రెండు క్వింటాల బియ్యం, రెండు నెలలకు సరిపడే పప్పు, ఉప్పులు, ఇతర సామాగ్రి అంతా కొనుగోలు చేసి తోటి నటుడికి సహాయం చేశాడు అని ఉత్తేజ్ చెప్పారు. అలాంటి మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందంటూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా వైడ్ ట్రెండింగ్
వేణు మాధవ్ మృతిపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వ్యక్తమవుతున్నది. ట్విట్టర్‌లో ఇండియాలోనే రెండో స్థానంలో ట్రెండ్ అవుతున్నది. ట్విట్టర్‌లో లక్ష 80 వేల మందికి పైగా ట్వీట్ చేయడంతో ఆయన మృతివార్త ట్రెండిం గ్‌గా మారింది.