twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నీ ప్లాపులే.. మామయ్యలు ఆస్తి ఇవ్వబట్టే ఇలా ఉన్నా: సాయి ధరమ్ తేజ్

    |

    సాయి ధరమ్ తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'చిత్రలహరి'. నివేదా పేతురాజ్‌, కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌. ఏప్రిల్‌ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఈ సినిమా నుంచి సాయి ధరమ్ తేజ్ తన పేరును 'సాయి తేజ్' గా మార్చుకున్నారు. వరుసగా ప్లాపులు ఎదురవ్వడంతో జ్యోతిష్యుల సూచన మేరకు అతడు తన పేరును ఇలా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు కొరటాల శివ, సుకుమార్‌ ముఖ్యఅతిథులుగా హాజరైన టీజర్ రిలీజ్ చేశారు.

    వరుస ప్లాపులు ఉన్నా సరే...

    వరుస ప్లాపులు ఉన్నా సరే...

    ‘‘మైత్రీ మూవీస్‌ నాకు స్పెషల్‌. ఆరు సినిమాల ప్లాప్‌ తర్వాత కూడా నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థాంక్స్‌. కిషోర్‌ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం, ఆయన సంగీతానికి అభిమానిని, ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కూడా కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది.'' అని సాయి తేజ్ తెలిపారు.

    మా ముగ్గురు మావయ్యల వల్లే

    మా ముగ్గురు మావయ్యల వల్లే

    ‘‘ఇన్ని సినిమాలు ప్లాపైన తర్వాత కూడా అభిమానుల సపోర్ట్, ప్రేమ ఉన్నందుకు నేను చాలా లక్కీ. ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉండటానికి కారణం మా ముగ్గురు మామయ్యలు, మెగా ఫ్యాన్స్. ఎన్ని ప్లాపులు వచ్చినా, హిట్లు వచ్చినా మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.'' అంటూ సాయి తేజ్ ఎమోషనల్ అయ్యారు.

    వారి నుంచి నాకు దక్కిన ఆస్తి

    వారి నుంచి నాకు దక్కిన ఆస్తి

    ఇందాక ఎవరో తేజ బాబు అని పిలిచారు. దయచేసి నన్ను అలా పిలవద్దు. మీరు ప్రేమగా తేజ్ అని పిలిచినా పలుకుతా. ‘బాబూ' అనే రెస్పెక్ట్ వద్దు. తేజు అని పిలిచిస్తే సొంతవాళ్లు అనే ఫీలింగ్ వస్తుంది. మా ముగ్గురు మామయ్యలు ఇచ్చిన ఆస్తి మెగా ఫ్యాన్స్. కష్టపడి మంచి సినిమాలు చేసి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తానని... సాయి తేజ్ చెప్పుకొచ్చారు.

    చిత్ర లహరి

    చిత్ర లహరి

    ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రల‌హ‌రి తెర‌కెక్కింది. టైటిల్‌లో ఐదు అక్ష‌రాలు ఉన్న‌ట్లు సినిమాలో ఐదు క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటుందట. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

    English summary
    Sai Dharam Tej Speech at Chitralahari Pre Release Event. The Movie ft. Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj and Sunil among others. Music composed by Devi Sri Prasad / DSP. Directed by Kishore Tirumala. Produced by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM) under Mythri Movie Makers banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X