For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే రికార్డు: టాలీవుడ్‌లో 9వ స్థానం.. ఇందులో రెండో ర్యాంక్

  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే అయినా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన ఈ యంగ్ హీరో.. కొన్నేళ్ల క్రితమే హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'రిపబ్లిక్' అనే మూవీ చేశాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసింది ఆ వివరాలు మీకోసం!

  విజయాల హ్యాట్రిక్ నమోదు చేసిన స్టార్

  విజయాల హ్యాట్రిక్ నమోదు చేసిన స్టార్

  సుదీర్ఘ విరామం తర్వాత ‘చిత్రలహరి' అనే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతటితో ఆగని ఈ మెగా హీరో.. గత ఏడాది ‘సోలో బ్రతుకే సో బెటర్'తో మరో హిట్ కొట్టాడు. ఇలా హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నాడు.

  ‘జానకి కలగనలేదు' హీరో చనిపోయాడంటూ వార్త: అసలు మేటర్ రివీల్ చేస్తూ.. ఆరియానా సంచలన వ్యాఖ్యలు

  టాలెంటెడ్ డైరెక్టర్‌తో ‘రిపబ్లిక్' మూవీ

  టాలెంటెడ్ డైరెక్టర్‌తో ‘రిపబ్లిక్' మూవీ

  హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో ‘రిపబ్లిక్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది.

  అనివార్య కారణాలు.. అప్పుడే విడుదల

  అనివార్య కారణాలు.. అప్పుడే విడుదల

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ‘రిపబ్లిక్' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ, అనివార్య కారణాల వల్ల దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  ఆస్పత్రిలో సాయి తేజ్.. ప్రమోషన్ షురూ

  ఆస్పత్రిలో సాయి తేజ్.. ప్రమోషన్ షురూ

  ఇటీవలే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ‘రిపబ్లిక్' మూవీ విడుదలకు సమయం దగ్గరపడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసేశారు. సాయి తేజ్ అందుబాటులో లేకపోయినా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయించింది చిత్ర యూనిట్.

  ఆకట్టుకుంటూ.. ఆలోచింపజేసిన ట్రైలర్

  ఆకట్టుకుంటూ.. ఆలోచింపజేసిన ట్రైలర్

  బుధవారం విడుదలైన ‘రిపబ్లిక్' ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ నటన ఆకట్టుకుంది. దేవ కట్టా టేకింగ్ కూడా బాగుంది. మణి శర్మ సంగీతం కూడా మెప్పించింది. మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ మొత్తంలో వినిపించిన డైలాగులు అదుర్స్ అనిపించాయి. దీంతో ఇది యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  24 గంటల్లోనే అన్ని వ్యూస్ లైకులతో సత్తా

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఆద్యంతం ఆకట్టుకున్న ‘రిపబ్లిక్' మూవీ ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో దీనికి వ్యూస్, లైకులు కూడా అదే రీతిలో దక్కాయి. 24 గంటల్లోనే ఈ మూవీ ట్రైలర్‌కు 3.91 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి. అలాగే, 324.7K లైకులు కూడా దక్కాయి. టైర్ 2 హీరోల చిత్రాల్లో ఇవి అద్భుతమైన ఫిగర్స్ అని చెప్పొచ్చు. దీంతో పలు రికార్డులూ వచ్చాయి.

  Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
  ఆ జాబితాలో 9వ స్థానం.. ఇందులో రెండు

  ఆ జాబితాలో 9వ స్థానం.. ఇందులో రెండు

  ‘రిపబ్లిక్' మూవీ ట్రైలర్‌కు మూడు లక్షలకు పైగా లైకులు రావడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. 24 గంటల్లోనే ఎక్కువ లైకులు సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది తొమ్మిదో స్థానానికి చేరుకుంది. అలాగే, టైర్ 2 హీరోల జాబితాలో ఇది రెండో ర్యాంక్‌లో నిలిచింది. దీని కంటే ముందు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ'కి 342K లైకులు వచ్చాయి. అదే టాప్‌లో ఉంది.

  English summary
  Mega Hero Sai Dharam Tej Now Doing Republic Movie Under Deva Katta Direction. Now This Movie Trailer Got 324.7K in 24 Hours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X