Just In
- 2 hrs ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- 3 hrs ago
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
- 3 hrs ago
సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!
- 4 hrs ago
ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- News
మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు... ఈసారి కేటాయింపులు ఎక్కువే... : సీఎం కేసీఆర్
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Lifestyle
Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...
- Automobiles
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సయీ మంజ్రేకర్‌తో అల్లు అర్జున్ రొమాన్స్: అదిరిపోయే ప్లాన్ వేసిన బడా డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ప్రస్తుతం సుకుమార్‌తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అడవుల్లో జరుగుతోంది.
'పుష్ప' మూవీ పట్టాలపై ఉండగానే అల్లు అర్జున్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. అదే సమయంలో బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన వెంటనే వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కనుంది. అంటే 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు హిందీ భామ సయీ మంజ్రేకర్‌ను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలిసింది. సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సహా పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. విలక్షణ నటుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మేజర్' ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అది విడుదల కాకముందే బన్నీ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.