Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఖల్నాయక్ ఇలా అయిపోయాడేంటి..!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కేన్సర్ ఉందని ఈ మధ్యే తేలింది. దాంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సంజు భాయ్ కు లంగ్ క్యాన్సర్ చాలా అడ్వాన్సడ్ స్టేజీలో ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉన్నా కూడా ఎప్పటికైనా అది ప్రమాదమే అని తెలిసిందే.
నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో గడుపుతున్నాడు మున్నాభాయ్.

సంజు భాయ్ ఆరోగ్యంపై అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఫొటో ఒకటి అభిమానులను మరింత కలవరానికి గురిచేస్తుంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు.
ఖల్ నాయక్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని, మళ్లీ షూటింగ్స్‌లో బిజీగా మారాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇటీవలే సడక్ 2 సినిమాలో కనిపించారు సంజయ్ దత్. మరో సినిమా 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' త్వరలో విడుదలకానుంది. దీనితో పాటు భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో అధీర పాత్రలో కనిపించనున్నారు.