Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సౌత్ లో విజయ్ దేవరకొండ హాట్.. చేస్తే అతనితోనే చేస్తా… కుండ బద్దలు కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లు అవుతోంది, ఒక స్టార్ హీరో కుమార్తె అయినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోంది. అత్రంగి రే ప్రమోషన్స్ సందర్భంగా , సారా అలీ ఖాన్ బాలీవుడ్ హంగామాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

దేశం కోసం సినిమాలు చేస్తా
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అత్రంగి రే' లోని పాత్రను పోషించడం గురించి, ఆ సమయంలో ఆమె పొందిన అనుభవం మరియు దేశం కోసం సినిమాలు చేయడం గురించి సుదీర్ఘంగా మాట్లాడింది. ఈ అత్రంగి రే సినిమాలో తన అనుభవం గురించి సారా మాట్లాడుతూ, "ఇది ఒక అద్భుతమైన అభ్యాస అనుభవం. నేను ఎక్కడ నుండి చదువుకున్నా లేదా వచ్చి ఉన్నా, చివరికి నేను నా దేశం కోసం సినిమాలు చేస్తానని పేర్కొంది. నేను భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తానని పేర్కొంది.

ప్రేక్షకుల నాడి
ఇక . అలా చేయడానికి, భారతీయ ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేను బనారస్ మరియు బీహార్ సరిహద్దుల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని మదురై మరియు ఢిల్లీలో కూడా చిత్రీకరించినట్లు చెప్పిన ఆమె ఆ సమయంలో విభిన్నమైన దేశం మరియు సంస్కృతి ఉందని నేను భావిస్తున్నానని వెల్లడించింది.

బీహారీ అమ్మాయిగా
"నేను భారతీయురాలిగా ఉన్నందుకు ఎప్పుడూ గర్వపడుతున్నానన్న ఆమె కొన్నిసార్లు ఇంగ్లీషులో, హిందీలో సంభాషించినా ఈ విషయాలు నాకు భిన్నమైనవి మరియు కష్టమైనవి కావు లేదా ప్రస్తావించ దగినవి కావని పేర్కొంది. నేను సినిమా మొత్తంలో బలమైన యాసతో బీహారీ అమ్మాయిగా నటిస్తున్నాను, అందుకు తగిన శిక్షణ తీసుకున్నాను ఎందుకంటే ఆనంద్ ఎల్ రాయ్ డైలాగ్ మరియు యాస నాకు సెకండరీ అని చెప్పే వ్యక్తి. యాక్షన్ మరియు కట్ మధ్య, మీరు మీ బాడీ లాంగ్వేజ్ లేదా డైలాగ్‌ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆయన అంటూ ఉండేవారని ఆమె పేర్కొంది.

విజయ్ హాట్ గా
ఇక ధనుష్ తరువాత మీరు ఏ సౌత్ సూపర్ స్టార్ తో నటించాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆమె తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని పేర్కొంది. అయితే ఆయన చాలా కూల్ కదా అంటే అవును అని అంటూనే, ఇన్ ఫాక్ట్ కూల్ కంటే ఎక్కువ హాట్ అని పేర్కొంది. అవును నేను ఒప్పుకుంటాను, అంటే చాలా మంది అమ్మాయిలు అదే ఫీల్ అవుతూ ఉంటారని ఆమె పేర్కొంది.

సోషల్ మీడియాలో చాలా చురుకుగా
ఇక ఆమె నటించిన అత్రాంగి రే 24 డిసెంబర్ 2021న OTT విడుదల కానుంది. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండనుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె తన వీడియోలను మరియు ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. సారా అలీ ఖాన్ అలా షేర్ చేసిన బికినీ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.