14 కిలోలు తగ్గిన హిందీ అర్జున్ రెడ్డి.. పాత్ర కోసం కఠినంగా..
తెలుగు ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్రలో షాహీద్ కపూర్, షాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై అనూహ్య స్పందనను సంపాదించుకొన్నది.
ఈ నేపథ్యంలో ట్రైనర్ సమీర్ జౌరా మాట్లాడుతూ.. పాత్ర కోసం షాహీద్ 14 కిలోలు తగ్గాడు. కాలేజ్ కుర్రాడిలా కనిపించడం కోసం రోజుకు 1400 నుంచి 1500 కిలోల క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలని కఠినంగా డైట్ చేయాలని ఆయనకు సూచించాను. ఎక్స్‌టెన్సివ్ కార్డియో సెషన్స్ కూడా నిర్వహించాం అన్నారు.

కబీర్ సింగ్ చిత్రం జూన్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.
kabir singh shahid kapoor kiara advani sandeep reddy vanga కబీర్ సింగ్ షాహీద్ కపూర్ కియారా అద్వానీ సందీప్ రెడ్డి వంగ


Click it and Unblock the Notifications