Don't Miss!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
లాక్ డౌన్ లో వంట చేసి ఇంప్రెస్ చేసిన స్టార్ హీరో
కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ చాలానే నేర్పింది. సూచి శుభ్రతతో పాటు కొంతమంది భర్తలు రకరకాల వంటలు కూడా నేర్పింది. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది హీరోలు ఈ లాక్ డౌన్ లో తమలో దాగిఉన్న టాలెంట్ ను బయటకు తీశారు. తమ కుటుంబ సభ్యులకు రుచికరమైన వంటలను వండి శబాష్ అనిపించుకున్నారు.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా తనలోని నలభీముడిని బయటకు తీశారని ఆయన సతీమణి గౌరీఖాన్ మురిసిపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌరీఖాన్ మాట్లాడుతూ .. నా ఇంటిని నేను మానేజ్ చేయను మా ఇంటి రిమోట్ కంట్రోల్ మొత్తం ఢిల్లీ నుంచి మా అమ్మ ఆపరేట్ చేస్తుంటారు అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంటికి సంబందించిన ప్రతిదీ తన తల్లికి తెలిసిపోతుందని , తమ సిబ్బందితో ఎప్పుడు ఆమె టచ్ లో ఉంటుందని ,ఆమె అక్కడి నుంచి ఫోన్ చేసిమరీ ఇక్కడ మమ్మల్ని కంట్రోల్ లో పెడుతుందని గౌరీ ఖాన్ తెలిపింది.

ఇక లాక్ డౌన్ సమయంలో షారుక్ తనకు ఇష్టమైన ఇంటిభోజనాన్ని తానే స్వయంగా వండుకున్నారని గౌరీ పేర్కొన్నారు . మొదట్లో బయటనుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే బయపడ్డాం .. దాంతో షారుఖ్ కిచన్ లోకి వెళ్లి తన టాలెంట్ చూపించాడు. ఆయన వంటచేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు అని గౌరీ ఖాన్ తెలిపారు.
ఇక షారుక్ సినిమాల విషయానికొస్తే .. చివరగా షారుక్ జీరో అనే ప్రయోగాత్మక సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయన మరుగుజ్జుగా కనిపించి ఆకట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. త్వరలో ఓ యాక్షన్ సినిమాలో షారుక్ నటించనున్నాడు. సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది .