గొడవలు రాకుండా ఉండాలని రవితేజను ఫాలో అవుతున్న శర్వానంద్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య శర్వానంద్ ఒక వివాదంలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. సాధారణంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే శర్వానంద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లడనేది అందరికి తెలిసిన విషయమే. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఏనాడు కూడా ఈ కూల్ హీరో సహనం కోల్పోలేదు. సమస్యలు వచ్చినా కూడా నెమ్మదిగా మాట్లాడుకొని సెటిల్ చేసుకునేవాడట.

అయితే సడన్ గా 14 రీల్స్ లాంటి బడా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపడంతో అందరూ షాక్ అయ్యారు. శ్రీకారం సినిమాకు గాను బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టారని శర్వా సిరియస్ అవుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అయితే ఈ తలనొప్పి లేకుండా నెక్స్ట్ సినిమాల నుంచి రవితేజ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రవితేజ అనే కాదు. చాలామంది ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు.

Sharwanand following raviteja plan after remuneration issues

ఒక సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేసి రిలీజ్ అనంతరం షేర్స్ లో వాటా తీసుకోవాలని అగ్రిమెంట్ సెట్ చేసుకుంటున్నారు. క్రాక్ సినిమా రవితేజకు బాగా కలిసొచ్చింది. దెబ్బతో ఆ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక శర్వానంద్ కూడా అదే తరహాలో ఏదైనా ఒక ఏరియా షేర్స్ తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇటీవల ఓకే చేసిన .ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమా కోసం కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరి శర్వానంద్ ఆ సినిమాతో ఏ స్థాయిలో లాభాలు అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X