Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Sharwanand: అమెరికా అమ్మాయితో శర్వానంద్ పెళ్లి.. అల్లు అర్జున్, రామ్ చరణ్ బాటలోనే హీరో!
తనదైన నటన, విభిన్నమైన కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో మెరిసిన శర్వానంద్ హీరోగా మారి ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రన్ రాజా రన్, శతమానం భవతి వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టిన శర్వానంద్ తర్వాతి కాలంలో వరుస పరాజయాలు చవిచూశాడు. ఇటీవల మాత్రం ఒకే ఒక జీవితం సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్ లర్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆయన పెళ్లిపై ఇప్పటికే ఒకరకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్..
రన్ రాజా రన్, శతమానం భవతి, ఒకే ఒక జీవితం వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టాడు హీరో శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టైమ్ ట్రావెల్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు. వరుసగా ఐదు ఫ్లాప్ లు చవిచూసిన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ గా వాళ్లిద్దరు..
ఇదిలా ఉంటే టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఎక్కువగా వినిపించే పేర్లు ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే.. మరొకటి శర్వానంద్. ప్రభాస్, శర్వానంద్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా పెళ్లి ఎప్పుడు అనే వార్త కచ్చితంగా ఉంటుంది. ఇక వీళ్ల పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అంతా ఇంతా కాదు.

ప్రభాస్ తర్వాత అని చెప్పి...
ఇటీవల శర్వానంద్ ఆహా వేదికగా ప్రసారమైన నందమూరి నటసింహం బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 సీజన్ కు అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇందులో శర్వానంద్ పెళ్లి గురించి అడగ్గా.. ప్రభాస్ చేసుకున్న తర్వాత అని చెప్పి నవ్వించాడు. ప్రభాస్ ఏమో ఇంకా పెళ్లి రాత రాసిపెట్టలేదు సార్ అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ తర్వాతే పెళ్లి అన్న రూల్ ను శర్వానంద్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్..
హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా టాలీవుడ్ సినీ వర్గాల్లో అధికంగా ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ పెళ్లి చేసుకునే అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. కొవిడ్ ప్రభావంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. అయితే శర్వానంద్ ది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాని అధికారిక ప్రకటన..
ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పి శర్వానంద్ తన ఇంట్లో వాళ్లను ఒప్పించాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే ఆ అమ్మాయిని శర్వానంద్ ఎక్కడ.. ఎలా.. ఎప్పుడు కలిశాడు.. ఇదంతా ఎప్పుడు జరిగిందని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం గురించి శర్వానంద్ నుంచి గానీ, వాళ్ల కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వాళ్ల బాటలోనే..
ఈ నేపథ్యంలోనే శర్వానంద్ చేసుకునే అమ్మాయికి సంబంధించిన వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని శర్వానంద్ వివాహం చేసుకోనున్నాడట.అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే ప్రేమించి పెల్లి చేసుకున్నారని తెలిసిందే. మెగా కుటుంబానికి శర్వానంద్ కి మంచి బాండింగ్ ఉంది. అలా బన్నీ, చెర్రీ బాటలోనే శర్వానంద్ పయనించాడని నెటిజన్లు అంటున్నారు.