Siddu Jonnalagadda: ఉమనైజర్ కామెంట్స్‌పై సిద్ధు జొన్నలగడ్డ ఫైర్ .. మైక్ ఉంది కదాని అలా...
Siddu Jonnalagadda: ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో సెలబ్రిటీ-జర్నలిస్ట్ వివాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడుగుతారోనని చాలా మంది నటీనటులు మీడియాలో మాట్లాడటానికే వెనుకంజ వేస్తున్నారు. ఇటీవలే మంచు లక్ష్మీపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిలిం ఛాంబర్‌కి ఫిర్యాదు చేయడం, క్షమాపణలు చెప్పించుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వివాదం చల్లారకముందే, ఇప్పుడు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారు. తాజాగా జర్నలిస్ట్ వ్యాఖ్యలపై హీరో సిద్దు ఇలా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
"తెలుసు కదా" ప్రమోషన్స్‌లో వివాదం
సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, సంగీతం తమన్ అందించారు. విడుదల తేదీ దగ్గరపడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒక మహిళా జర్నలిస్ట్ సిద్దుని ఉద్దేశించి షాకింగ్ ప్రశ్న అడిగారు. "రియల్ లైఫ్‌లో మీరు ఉమనైజరా? ఇద్దరు అమ్మాయిలను ప్రేమించారా?" అని అడిగారు. ఈ ప్రశ్న విని అక్కడే ఉన్నవారు షాక్ అయ్యారు. సిద్దు మొదట తడబడి నవ్వి "ఇది సినిమా గురించి ప్రెస్ మీటా? లేక నా పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూనా?" అంటూ స్మార్ట్‌గా బదులిచ్చారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మళ్లీ చెలరేగింది.
ప్రెస్‌మీట్‌లో సిద్దు స్పందన
మంగళవారం జరిగిన మరో మీడియా మీట్‌లో సిద్దు ఈ అంశంపై స్పష్టంగా స్పందించారు. "చేతిలో మైక్ ఉందని ఏదిపడితే అది మాట్లాడటం సరికాదు. అలాంటి ప్రశ్నలు చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్. ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు," అని అన్నారు. "ఇకనైనా విలేకరులు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. సినిమాలో నేను అండర్‌కవర్ పోలీస్‌గా నటించాను కాబట్టి నిజ జీవితంలోనూ చంపుకుంటూ తిరుగుతానా? సినిమాలో డ్రగ్ అడిక్ట్‌గా నటిస్తే నిజంగా డ్రగ్స్ తీసుకుంటానా? ఇది సినిమా కదా. వ్యక్తిగత విషయాలపై ఇలాంటివి అడగడం సరైంది కాదు." తనదైన స్టైల్ సమాధానమిచ్చారు.
అంతే కాకుండా సిద్దు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. "ఆ జర్నలిస్ట్ కొద్ది సేపటి ముందే మా టీమ్‌ని ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. ఐదు నిమిషాల తర్వాత ఇలాంటి ప్రశ్న అడిగారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు కాబట్టి హీరో అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనుకుంటారా? అలాంటి మైండ్‌సెట్ సరికాదు" అని జర్నలిస్ట్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు హీరో సిద్దూ. ఇదిలా ఉంటే.. ఈ వివాదం సినిమా ప్రమోషన్స్‌పై ప్రభావం పడుతుందా? అనేది చూడాలి. ట్రైలర్‌కు వచ్చిన మంచి రెస్పాన్స్, సిద్దు-రాశీ ఖన్నా జోడీపై హైప్స్ ఉన్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలవుతున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ మేకర్స్ నమ్ముతోంది.
మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు "హీరోను ఇబ్బందిపెట్టే విధంగా ప్రశ్న అడగడం తప్పు" అని విలేకరిని విమర్శిస్తుండగా, మరికొందరు "సిద్దు స్మార్ట్‌గా హ్యాండిల్ చేశాడు"అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, 'తెలుసు కదా' విడుదలకు ముందే సిద్దు పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











