స్టార్ హీరోయిన్‌తో సిద్దూ జొన్నలగడ్డ పెళ్లి.. లీక్ చేసిన సోదరుడు చైతన్య
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. వరుసగా యంగ్ హీరోల పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ఏడాది వరుసగా చాలా యువ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి, వివాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇటీవల అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ రోజులకు గుడ్ బై చెప్పగా, అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ కూడా త్వరలో పెళ్లికి సిద్దమవుతున్నారట, తన ప్రియురాలిని పెళ్ళాడబోతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కుర్ర హీరో, హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ లిస్ట్ లోనే మరో యంగ్ హీరో చేయబోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?
ఆ హీరో ఎవరో కాదు.. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న పాత్రలతో సినీరంగంలో అడుగుపెట్టిన తర్వాత, స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా కనిపించి, తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు పొందిన సిద్ధు, ప్రారంభంలో నటించిన కొన్ని చిత్రాలు పెద్ద విజయాన్ని అందించలేకపోయినా, డీజే టిల్లు సినిమాతో కెరీర్‌లో మలుపు తిప్పాడు. ఈ హిట్ సినిమాతో ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సిద్ధు, ఒక్కసారిగా పేరు మారుమోగింది.

అలాగే.. సిద్ధు రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో తన ప్రత్యేక శైలిని చూపుతూ, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా ఎదిగాడు. డీజే టిల్లు విజయంతో వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా హిట్‌గా నిలిచింది. అయితే, తర్వాత వచ్చిన జాక్ సినిమా, వైష్ణవి చైతన్యతో జంటగా నటించినప్పటికీ, ఊహించని ఫ్లాప్‌గా ముగిసింది.
ఇదిలా ఉంటే.. సిద్ధు జొన్నలగడ్డ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్‌తో జరుగుతుందంటూ ప్రచారం ఉంది. ఈ విషయంపై సిద్దు సోదరుడు చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. చైతన్య మాట్లాడుతూ, "సిద్ధు ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాదిలో వివాహం జరగవచ్చని వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, అదే స్టార్ హీరో అయితే సమస్యలు అవుతాయి" అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
సిద్దూకి త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉందని, కానీ స్టార్ హీరోయిన్‌తో వివాహం జరుగుతుందో.. వేరే హీరోయిన్ తో జరుగుతుందో మాత్రం తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే.. వచ్చే ఏడాదే వివాహం జరగవచ్చని తెలుస్తోంది. చైతు జొన్నలగడ్డ.. రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంలో నటించారు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. చైతన్య మాత్రం తాను సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకున్నాననీ, బ్యాచ్‌లర్ లైఫ్ బెటర్ అని అంటున్నారు. అలాగే.. తనకు ఇండస్ట్రీలో కూడా అంత పెద్ద ప్రెండ్స్ లేరనీ, తాను ఇంట్రావర్డ్ అని చెప్పుకొచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











