twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12 చిన్నారుల ప్రాణాలు కాపాడిన సోనుసూద్.. నెటిజన్‌ తింగరి ప్రశ్న.. దూల తీర్చేలా జవాబు

    |

    కరోనావైరస్ వ్యాప్తి సమయంలో విధించిన లాక్‌డౌన్‌లో బాలీవుడ్ హీరో సోనుసూద్ స్పందించిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికి ఎవరైనా ఇబ్బంది పడితే స్పందించి వారిని ఆదుకొంటూ సోనుసూద్ వార్తల్లో నిలుస్తున్నారు. పలు రాష్ట్రాల్లో నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న బాధితులకు కూడా సహాయం చేస్తూ దయాగుణం చాటుకొంటున్నారు. తాజాగా సోను సూద్ చేపట్టిన కార్యక్రమాలు, కొందరి సహాయంపై స్పందించిన తీరు ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల సోను సూద్ చేపట్టిన కార్యక్రమాలు మీ కోసం..

    Recommended Video

    Sonu Sood's Old Mumbai Local Pass Goes Viral
    ఫిలిప్ఫైన్‌లో చిక్కుకుపోయిన వలసదారులకు

    ఫిలిప్ఫైన్‌లో చిక్కుకుపోయిన వలసదారులకు

    తాజాగా ఫిలిప్ఫైన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ వలసదారులను ఆదుకొనే ప్రయత్నం చేశారాు. దాదాపు 1200 మందిని భారత్‌లోని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక విమాన ఖర్చులను భరించారు. అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం ఎదురుచూస్తున్న12 మంది చిన్నారులను ఢిల్లీకి చేర్చి వారికి చికిత్స అందిస్తున్నారు.

    12 మంది చిన్నారులకు అత్యవసర చికిత్స

    12 మంది చిన్నారులకు అత్యవసర చికిత్స

    అత్యవసర చికిత్స అవసరమైన 12 మంది చిన్నారులను ఢిల్లీకి చేర్చేందుకు ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లయిట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లయిట్‌కు అయిన ఖర్చును భరిస్తూ వారిని సెబు సిటీ, మనీలా నుంచి ఢిల్లీకి చేర్చారు. డిల్లీలోని మాక్స్ సూపర్ హాస్పిటల్, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ కోసం చర్యలు తీసుకొన్నారు.

     మీ కారు ఇస్తే రాజస్థాన్ వెళ్లి వస్తా

    మీ కారు ఇస్తే రాజస్థాన్ వెళ్లి వస్తా

    ఇదిలా ఉండగా, ట్విట్టర్‌లో సోనుసూద్‌ను చిలిపి కోరిక కోరాడు. నా అమ్మమ్మ, తాతలను చూడటానికి నీ కారు ఇవ్వండి. కారులో రాజస్థాన్‌కు వెళ్లి వారిని చూసి వస్తాను. సెప్టెంబర్ 20 నుంచి ఓ వారంపాటు నాకు కారు అవసరం ఉంటుంది. దయచేసి కారును ఏర్పాటు చేయండి. సొంతంగా కారును డ్రైవ్ చేసుకొంటూ వెళ్లివస్తాను అంటూ ట్వీట్ చేశారు.

    నీ ఆ కష్టం ఎందుకు.. నేను కారు డ్రైవ్ చేస్తా..

    నీ ఆ కష్టం ఎందుకు.. నేను కారు డ్రైవ్ చేస్తా..

    అయితే కారును సమకూర్చమని అడిగిన తింగరి బాబుకు సోను సూద్ తనదైన శైలిలో స్పందించారు. సొంతంగా డ్రైవింగ్ చేసే కష్టం ఎందుకు? నేనే స్వయంగా కారు నడుపుకొంటూ వస్తాను. దయచేసి ఎలాంటి కారు కావాలో తెలియజేయండి. ఏ రేంజ్‌లో టెంపరేచర్ ఉండాలో తెలియజేస్తే.. అలాంటి కారును నేను రెడీ చేస్తాను అంటూ ఓ చిన్న సెటైర్‌ను సోను సూద్‌ విసిరారు.

     నీ మంచితనాన్ని వాడుకొనేందుకు

    నీ మంచితనాన్ని వాడుకొనేందుకు

    సోను సూద్ ఇచ్చిన చిన్న ఝలక్‌పై నెటిజన్ల భారీగా స్పందించారు. నీ మంచి తనాన్ని చూసి కొందరు వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు కోరిన వ్యక్తికి దూల తీరేలా ఫన్నీగా జవాబిచ్చారు. ఏది ఏమైనా మీరు చేస్తున్నా సేవాభావం అందర్నీ ఆకట్టుకొంటున్నది. ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తున్నదని సోనుసూద్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

    English summary
    Bollywood actor Sonu Sood doing great philanthropic services in lockdown period. He arranged a charted flight to save 12 Filipino children who need organ transplantation emergency. and Sonu gives funny reply to netizen who asked a car to self drive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X