For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంటర్నేషనల్ టెక్నీషియన్‌తో రానా.. ఆ హీరోల తర్వాత ఇతడే.!

  By Manoj Kumar P
  |

  ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ టెక్నీషియన్లు ఇక్కడికి దిగుమతి అవుతున్నారు. ఇటీవల వచ్చిన 'సాహో'తో పాటు 'సైరా' సినిమాలకే పలువురు అంతర్జాతీయ టెక్నీషియన్లు పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జాబితాలోకి మరొకరు వచ్చి చేరుతున్నారు. అది కూడా టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కొత్త సినిమా ద్వారా. అవును.. రానా త్వరలోనే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకీ ఏ సినిమా కోసం రానా ఈ ప్లాన్ చేస్తున్నాడు..? ఎవరా యాక్షన్ డైరెక్టర్..?

  పాత కథతో కొత్తగా వస్తున్నాడు

  పాత కథతో కొత్తగా వస్తున్నాడు

  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - సాయి పల్లవి కలిసి చేయబోతున్న చిత్రం ‘విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అలాగే సాయి పల్లవి మావోయిస్టుగా కనిపించబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగనుందని తెలుస్తోంది.

  ఎన్నో ఆటంకాలు

  ఎన్నో ఆటంకాలు

  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కానీ, సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, ఇటీవల ఈ సినిమా తాలూకు పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

  రానాకు అనారోగ్యం

  రానాకు అనారోగ్యం

  చాలా రోజుల పాటు దగ్గుబాటి రానా విదేశాల్లో ఉన్నాడు. ఆయనకు కిడ్నీకి సంబంధించిన చికిత్స జరిగిందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ విషయంపై అటు రానా గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. అందులో ‘విరాట పర్వం' కూడా ఉంది.

  హాలీవుడ్ అడ్వెంచర్ ఫిల్మ్

  హాలీవుడ్ అడ్వెంచర్ ఫిల్మ్

  విరాట పర్వం సినిమా మొత్తం అడవిలోనే ఉంటుందట. అంతేకాదు, అడవిలో జరిగే పోరాటాలతో ఈ సినిమాను హాలీవుడ్ అడ్వెంచర్ మూవీలా తెరకెక్కించబోతున్నారట. అందుకే ఈ సినిమాను ఎంతో క్వాలిటీతో రూపొందించాలని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా దీని ఆధారంగానే ఉంటుందని అంటున్నారు.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
  ఆ హీరోల తర్వాత రానానే

  ఆ హీరోల తర్వాత రానానే

  ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే జర్మనీకి చెందిన స్టేఫాన్ రిచర్ అనే స్టంట్ కొరియోగ్రాఫర్‌ను తీసుకు వస్తున్నారట. ఈయన గతంలో బాలీవుడ్ చిత్రాలు ‘శివాయ్', ‘యురి' సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. అలాగే, అజిత్ నటించిన ‘బిల్లా 2'కి కూడా సేవలు అందించాడు. వీళ్ల తర్వాత ఇప్పుడు రానాతో పని చేయబోతున్నాడు.

  English summary
  Sai Pallavi is shooting for ‘Virata Parvam’. There were reports that Sai Pallavi is contemplating to walk out of this project as her dates are going to be wasted. You might get awestruck by Ajith's stunts in the movie Billa 2 and they are composed by none other than Stefan Richter from Germany.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X