Don't Miss!
- News
వివేకా హత్యకేసులో సంచలనం- ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు: 11 గంటలకు..!!
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
నిద్రలో ఉలిక్కిపడే వాడిని.. గుండె పగిలినంత బాధ.. కృష్ణ మరణంపై సుధీర్ బాబు కంటతడి
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ..

కృష్ణ గారు వదిలి వెళ్లిన తర్వాత
సూపర్ స్టార్ కృష్ణ మనల్ని వదిలిపోయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. నా ఫస్ట్ ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం జీవితంలో చాలా పెద్ద వెలితి. నా సినిమా రిలీజ్ తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చేది ఆయన నుంచే. వేల తారలు ఒక్కటిగా వెలిగిన సూర్యుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన కాగడా వెలిగించి వెళ్లారు. ఇప్పుడు కాగడాను పట్టుకొని నడువాల్సిన మా కుటుంబానిది. నాది. మనందరిది అని సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యారు.

కృష్ణ గారితోనే నా లైఫ్ టర్న్
నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు రకరకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వెళ్లాలా? వెళ్లొద్దా అనే మీమాంస నాలో.. నా భార్య, నా ఫ్యామిలీలో ఉండేది. కానీ కృష్ణ గారు.. వచ్చి నాకు అండగా నిలిచారు. కష్టపడితే.. పైకి వస్తాడు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లనివ్వండి అని అన్నారు. అప్పటి నుంచి నా లైఫ్ పెద్ద టర్న్ తీసుకొన్నది.
మంచి విలువ, గౌరవం, నా జీవితానికి ఓ అర్ధం లభించింది. మంచి సినిమాలు చేశాను. కెరీర్ చాలా స్థిరంగా ఉంది. కృష్ణ గారు చనిపోవడానికి 30 రోజుల ముందు అడిగితే.. నేను మహేష్, సుధీర్ సినిమాలు తప్ప మరో సినిమా చూడను అని కృష్ణ చెప్పారు. అంతకంటే నా జీవితానికి ఏముంటుంది? అని సుధీర్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు.

కృష్ణ గారికి రుణపడి ఉంటా
వందలాది సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు.. మూడు గంటలు స్థిరంగా కూర్చొని ఉండలేని పరిస్థితిలో నా సినిమా చూస్తానని చెప్పడం నా జీవితానికి గొప్ప విషయం. ఎంతదూరం వెళ్తానో తెలియదు. నా ప్రయాణానికి కారణం మామయ్య గారే. ఆయనకు రుణపడి ఉంటాను. కృష్ణ గారు కేవలం మెమోరీస్ ఇవ్వలేదు. నాకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్లారు. ఆ ధైర్యంతోనే హంట్ సినిమా చేశాను అని సుధీర్ బాబు చెప్పారు.

హంట్ సినిమా చేయడం పెద్ద రిస్క్
హంట్ సినిమా చేయడం పెద్ద రిస్క్. ఇప్పటికి వందల మంది ఈ సినిమా చూశారు. చూసిన ప్రతీ ఒక్కరి నోట సినిమా బాగుందనే చెప్పారు. నిర్మాత ఆనంద ప్రసాద్ గారు.. నా కంటే ఎక్కువగా రిస్క్ చేశారు. యూరప్‌లో స్టంట్స్ మాస్టర్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాడిని.
ఈ సినిమాకు వాళ్లు అయితే బాగుంటుందని చెబితే.. వెంటనే ఒప్పుకొని కోట్ల రూపాయలు వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన చేసిన రిస్క్ ముందు నేను చేసిన రిస్క్ పెద్దదేమీ కాదు. ఆయన, రవి అన్నె గారు లేకపోతే హంట్ సినిమా సాధ్యం కాదు. అలాగే శ్రీకాంత్, భరత్ లేకపోతే ఈ సినిమా లేదు అని సుధీర్ బాబు చెప్పారు.
కృష్ణ గారు చనిపోయిన తర్వాత
సూపర్ స్టార్ కృష్ణ గారు.. హంట్ సినిమా షూట్ తర్వాత చనిపోయారు. వేరే సినిమా షూట్ జరుగుతున్నది. ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. ఆయన చనిపోవడంతో మేము విషాదంలో మునిగిపోయాం. ఆయన గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. అర్ధరాత్రి నిద్రలో లేచి వణికిపోయేవాడిని. కానీ సినిమా షూట్‌లోకి వెళితే.. అవన్నీ మరిచిపోతాం.
కృష్ణ గారి విషయంలో ముందు రోజే నాకు తెలుసు. కానీ వేరే సినిమా సమయంలో మా నాన్న గారికి కోవిడ్ పాజిటివ్ అన్నారు. అయితే ఏం కాదులే అని చెప్పి.. షూట్‌కు వెళ్లాను. కానీ హాస్పిటల్ చేర్పించారనే విషయం తెలిసి.. షాక్ అయ్యాను. ఆ సమయంలో నేను రొమాంటిక్ సీన్లలో నటించాలి. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ సీన్ చేయాల్సి వచ్చింది. సినిమాకు ఉండే శక్తి అలాంటిది అని సుధీర్ ఎమోషనల్ అయ్యారు.