క్లైమాక్స్ గుండెను పిండేసింది.. రైటర్ పద్మభూషణ్‌కు మహేష్ బాబు ప్రశంసలు

యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. టీనా, శ్రీ గౌరి ప్రియ, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ, రోహిణి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం సగటు ప్రేక్షకులనే కాకుండా స్టార్ హీరోలను కూడా ఆకట్టుకొంటున్నది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసిన తర్వాత ట్విట్టర్‌లో ఏమని కామెంట్ చేశారంటే..

రైటర్ పద్మభూషణ్ సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ప్రత్యేకంగా క్లైమాక్స్‌ హృదయాన్ని పిండేసేలా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రం. యాక్టర్ సుహాస్ ఫెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. నిర్మాతలు శరత్, అనురాగ్ మైరెడ్డి, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌కు కంగ్రాట్స్. భారీ విజయాన్ని అందుకొంటున్న యూనిట్ సభ్యులకు అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ట్వీట్‌కు నిర్మాత శరత్ చంద్ర స్పందిస్తూ.. నటుడిగానే కాదు.. మనసున్న వ్యక్తిగా ఆయన సూపర్ స్టార్. రైటర్ పద్మభూషణ్‌కు మీరిచ్చిన ప్రశంసకు చాలా చాలా థ్యాంక్స్. మా టీమ్ మొత్తానికి మామూలు ప్రోత్సాహం కాదు. మా సినిమా మీకు మంచి అనుభూతిని పంచిందని తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది. మా హీరో సుహాస్‌కు డ్రీమ్ కమ్ ట్రూ ఇది అని నిర్మాత శరత్ చంద్ర అన్నారు.

Super Star Mahesh Babu appreciation for Writer Padmabhushan team and Actor Suhas

ఇక రైటర్ పద్మభూషణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓవర్సీస్‌లో 200K డాలర్లను, ఇండియావైడ్ 7 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్లు మెల్లగా పుంజుకొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X