రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ రేంజ్‌లో రవితేజ.. ఆ విషయంలో తగ్గని మాస్ మహారాజ్.. సూర్య పొగడ్తలు

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మాస్ జాతర. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, నితిష్ నిర్మల్, రీతూ పీ సూద్ తదితరులు నటించిన చిత్రానికి భాను భోగవరం దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, విధు అయ్యన్న సినిమాటోగ్రఫిని, నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో థియేటర్లలో ఈ చిత్రం అడుగుపెట్టనున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మంగళవారం (అక్టోబర్ 28వ తేదీన) సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ..

Suriya Praises Ravi Teja

రవితేజ అభిమానులను, నా అభిమానులను కలిపి ఇలా చూడటం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ మధ్యలో జరిగే ఇలాంటి ఈవెంట్లకు హాజరు కావడం నాకు చాలా ఇష్టం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను ఆహ్వానించిన నిర్మాత నాగవంశీకి కృతఙ్ఞతలు. రవితేజ గారితో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. అందుకే ఓ ఫ్యాన్ బాయ్‌లా మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే సంతోషం కలుగుతుంది అని సూర్య అన్నారు.

మనిషి రూపంలో ఎనర్జీని చూడాలంటే అది రవితేజ గారే. చాలా ఏళ్లుగా ఆయనపై అభిమానులు ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. తెరపై కామన్ మ్యాన్‌ను కింగ్ సైజ్‌లో సహజంగా చూపించాలంటే.. అది ఆయనకే సాధ్యమవుతుంది. సహజ నటనతో పాత్రకు ప్రాణం పోసత్ారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ రవితేజ మాత్రం హ్యుమర్, ఫన్‌ను తేలికగా పండిస్తారు. తెలుగు ప్రేక్షకులు నవ్వుకునేలా చేస్తారు అని సూర్య అన్నారు.

తెలుగులో రవితేజ నటించిన ఇడియట్, కిక్, విక్రమార్కుడు సినిమాలు తమిళంలో మంచి ఆదరణ పొందాయి. విక్రమార్కుడు సినిమా తమిళంలో నా తమ్ముడు కార్తీక్ రీమేక్ చేస్తే.. ఆయన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అయింది. రవితేజ మాదిరిగా వినోదాన్ని పంచేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వినోదాన్ని పంచగలరో అలా రవితేజ కూడా పండిస్తారు. ఆయన ఇలాగే వినోదాన్ని పంచాలి. మాస్ జాతర సినిమాతో రవితేజ కలెక్షన్ల జాతర చూడబోతున్నాం అని సూర్య తెలిపారు.

రవితేజ గారు తన కెరీర్‌ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. సపోర్టింగ్ యాక్టర్‌గా నటించి మాస్ మహారాజ్ స్థాయికి ఎదుగారు. నటుడిగా ఆయన ఎందరికో స్పూర్తి. నిర్మాత నాగవంశీ వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్‌లో నేను కూడా ఓ సినిమాను చేస్తుండటం సంతోషంగా ఉంది. భీమ్స్ మ్యూజిక్ అద్బుతంగా ఉంది. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పనిచేస్తాను. 31వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను అని ఆయన ఆకాంక్షించారు.

More from Filmibeat

Read more about: suriya ravi teja Mass Jathara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X