For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎదుటి వారిలో తప్పులు వెతకడం కాదు, నీ తప్పేంటో తెలుసుకో: సూర్య సెన్సేషనల్ స్పీచ్

|
Suriya Sensational Speech At NGK Pre Release Event | Filmibeat Telugu

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన తెలుగు, తమిల చిత్రం 'ఎన్‌.జి.కె'. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. సినిమా మే 31న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య ప్రసంగం ఆకట్టుకుంది. నా జీవితంలో దర్శకుడు శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఒక అద్భుతమైన పొలిటికల్ కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకో

నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకో

నా అభిమానులందరికీ నేను ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలనుకోవడం లేదు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడూ ఇతరులు ఏం చేస్తున్నారు? వారిలో తప్పు ఏమిటి? అని వెతుకుతూ, విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలా సమయం గడుపుతున్నాం. కానీ వాటి కంటే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనం ఏం తప్పు చేస్తున్నమో గుర్తించాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి, అప్పుడే మనం ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుందని సూర్య తెలిపారు.

దేశం నీకు ఏం చేసిందో కాదు.. దేశానికి నువ్వు ఏం చేశావ్?

దేశం నీకు ఏం చేసిందో కాదు.. దేశానికి నువ్వు ఏం చేశావ్?

ప్రభుత్వం మనకు ఏం చేస్తోంది? అనే దానికంటే ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం మనం ఏం చేస్తున్నామనే అంశాన్ని చర్చిస్తూ ‘ఎన్టీకె' చిత్రం తెరకెక్కుతోంది. వ్యక్తిగా మనం దేశానికి ఏం చేస్తున్నాం, వ్యవస్థలో మార్పుకు ఏ మేరకు తోడ్పడగలం అనేది గుర్తించాలి. ఆ తర్వాతే గవర్నమెంటును వేలెత్తి చూపాలి. ఇలా చేయడం ద్వారా ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్' క్రియేట్ అవుతుంది. భూటాన్‌లో ఇది అమలవుతోంది. మన దేశంలో కూడా ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచించాలి అనేది నా కోరిక అని సూర్య చెప్పుకొచ్చారు.

జగన్ గారిని అన్న అనిపిలుస్తాను

జగన్ గారిని అన్న అనిపిలుస్తాను

ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే చాలా గౌరవం. కేసీఆర్ గారి పని తీరుబావుంటుంది. జగన్ గారిని అన్న అని పిలుస్తాను. రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలు మరింత అభివృద్ధిని చూస్తాయని ఆశిస్తున్నాను. మరింత మంది యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కేవలం 2.5% మంది ప్రజలకు మాత్రమే రాజకీయ పార్టీల మేనిఫెస్టో మీద అవగాహన ఉంది. ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నీ NGK సినిమాలో చర్చించడం జరిగింది. ఎన్నికల తర్వాత ఎక్కడ చూసినా పొలిటికల్ ఫీవర్ ఉంది. ఇదే మా సినిమాకు విడుదలకు సరైన సమయం అని భావిస్తున్నట్లు సూర్య తెలిపారు.

NGK

NGK

సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.

English summary
Suriya Sensational Speech at NGK Pre Release Event. He is coming with a political thriller 'NGK' (Nandha Gopala Krishna) '7G Brundavana Colony', 'Aadavari Matalaku Ardhale Verule' fame Sri Raghava has Directed the film Produced by Dream Warrior Pictures and Reliance Entertainment. Popular Producer KK Radhamohan who produced Superhit films like 'Emaindi Ee Vela', 'Adhinetha', 'Bengal Tiger' in his Sri SathyaSai Arts banner is releasing 'NGK' in Telangana, Andhra Pradesh states. 'NGK' is releasing worldwide on May 31st.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more