twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఐదేళ్లుగా పన్ను ఎగవేత

    |

    కోలీవుడ్ నటుడు విశాల్‌ను అరెస్ట్ చేసేలా నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది చెన్నైలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్. ఆదాయ పన్ను శాఖ వారు విశాల్‌కు చెందిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ టిడిఎస్ బకాయిల విషయంలో కేసు వేయడంతో కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే విశాల్ ఆగస్టు 2న హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది.

    చెన్నై వడపళనిలోని 'విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ' కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్‌) విశాల్ ఐదేళ్లుగా చెల్లించలేదు. ఎన్ని సార్లు నోటీసులు పంపినా విశాల్ పట్టించుకోకపోవడంతో ఆదాయ పన్ను శాఖ వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ముందు హాజరైన వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినా విశాల్ రాక పోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు..

    TDS not paid for the past five years: Non-bailable arrest warrant against actor Vishal

    విశాల్ సినీ సెలబ్రిటీ అయినందున నేరుగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని అతడి న్యాయవాది కోరగా, దానికి ఆదాయ పన్ను శాఖ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విశాల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కేసును ఆగస్టు 28కి వాయిదా వేశారు.

    విశాల్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన తమిళ చిత్రం 'అయోగ్య' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తెలుగు మూవీ 'టెంపర్' రీమేక్. త్వరలో సుందర్ సి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

    English summary
    Non-bailable arrest warrant issued against actor Vishal in IT TDS case. Vishal is an Indian film actor and producer who works predominantly in the Tamil film industry along with two films in Telugu and one film in Malayalam language.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X