ఎన్టీఆర్ కోసం రంగంలోకి ముగ్గురు ప్రముఖులు: బడా డైరెక్టర్ స్కెచ్‌కు టాలీవుడ్ షాక్

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్, హోస్టింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పుడు వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ప్రకటించిన తారక్.. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

భీకరమైన ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్

భీకరమైన ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్

కొంత కాలంగా ఎన్టీఆర్ టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సక్సెస్‌లను కొట్టేశాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.

ప్రతిష్టాత్మక సినిమాలో కొమరం భీంగా

ప్రతిష్టాత్మక సినిమాలో కొమరం భీంగా

కొంత కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను చేస్తున్నారు.

30వ సినిమా డైరెక్టర్ మారిపోయాడుగా

30వ సినిమా డైరెక్టర్ మారిపోయాడుగా

RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు తారక్. అయితే, ఇది ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఎన్నో మలుపుల నడుమ ఈ సినిమాను ఆపేసినట్లు వెల్లడించారు. అనంతరం 30వ ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.

ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేస్తూ

ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేస్తూ

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని గురించి ఎన్నో రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఫలానా రోజు ప్రారంభం అవుతుందని అంటూ వస్తున్నారు. కానీ, ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు.

ఎన్టీఆర్‌కు గాయం.. మరింత ఆలస్యం

ఎన్టీఆర్‌కు గాయం.. మరింత ఆలస్యం

ఇప్పటికే RRR మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను కూడా కంప్లీట్ చేసేశాడు. దీంతో కొరటాల శివ మూవీ త్వరలోనే ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి చేతికి గాయం అయింది. దీంతో దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడు.

Recommended Video

RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Filmibeat Telugu
ఎన్టీఆర్ కోసం ముగ్గురు రైటర్లు ఎంట్రీ

ఎన్టీఆర్ కోసం ముగ్గురు రైటర్లు ఎంట్రీ

కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో ఏకంగా ముగ్గురు పేరున్న రచయితలు భాగం అయ్యారట. ఇప్పటికే వీళ్లంతా కలిసి ఫైనల్ స్క్రిప్టును కొరటాలకు అప్పగించారని.. ఆయన కొన్ని మార్పులు సూచించారని తెలుస్తోంది. అది కంప్లీట్ అయిన వెంటనే సినిమాను పట్టాలెక్కిస్తారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X