షేడ్స్ ఆఫ్ సాహో.. చాప్టర్ 2 బయటకొచ్చే సమయం ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆగష్టు 15న విడుదల అని ప్రకటించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో సాహోపై కళ్ళు చెదిరే అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకుడు సుజిత్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్ని రూపొందిస్తున్నాడు. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో చిత్ర యూనిట్ షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఈ వీడియోలో ప్రభాస్ స్టైలింగ్ అభిమానుల మతిపోగొట్టేలా చేసింది. ఇదిలా ఉండగా మార్చి 3న శ్రద్దా కపూర్ బర్త్ డే సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 పేరుతో మరో వీడియోని విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

 Time fix for Prabhas ShadesOfSaaho2

చిత్ర యూనిట్ దీనికి తాజాగా ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 3 ఉదయం 8:20 గంటలకు ఈ వీడియోని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అప్పుడే ట్విట్టర్ లో షేడ్స్ ఆఫ్ సాహో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, మందిర బేడీ లాంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X