For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RIP Krishna Garu: మాటలకు అందలేని విషాదం.. కృష్ణ గారికి చిరంజీవి, నాగ్, బాలయ్య, పవన్, ఎన్టీఆర్ నివాళి!

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి మరణ వార్త గురించి తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఈ విషాదంలో అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. అయితే ఆయన చేసిన సేవల గురించి అలాగే సినిమాల గురించి.. ప్రస్తుతం స్టార్ హీరోలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో స్టార్ హీరోలు కృష్ణ గారి గురించి గొప్పగా వివరణ ఇస్తున్నారు ఆ వివరాలలోకి వెళితే..

  బాలకృష్ణ నివాళి

  బాలకృష్ణ నివాళి

  నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ కృష్ణ గారి మరణం బాధను కలుగజేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. వారి కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉంది. కృష్ణ గారితో నాన్నగారు కొన్ని సినిమాలు చేశారు. ఇటీవల సోదరుడు మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మహేష్ బాబుకు ఈ కష్టాల కాలంలో ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను.. అని బాలకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

  నాగార్జున ఎమోషనల్ ట్వీట్

  నాగార్జున స్పందిస్తూ.. చలనచిత్ర పరిశ్రమలో ఆయన ప్రతి రంగంలో కూడా మంచి గుర్తింపుని అందుకున్నారు. ప్రతీ జానర్ లో కూడా సినిమాలు చేసిన ధైర్యవంతులు. ఒక నిజమైన కౌబాయ్ అని చెప్పవచ్చు. చాలా సింపుల్ గా గంటల తరబడి కష్టపడే కృష్ణ గారు షూటింగ్లలో ఉన్నప్పుడు.. చాలాసార్లు నేను పక్కనే ఉన్నాను. కృష్ణ గారిని మేము ఎప్పటికీ మిస్ అవుతాము.. అని సినీ నటుడు నాగార్జున భావోద్వేగంగా స్పందించారు.

  పవన్ కళ్యాణ్ ట్వీట్

  పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సూపర్ స్టార్ కృష్ణ గారు తుది శ్వాస విడిచారు అనే విషయం తెలియగానే ఎంతో ఆవేదన కలిగించింది. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించాను. కానీ ఈ వార్త వినాల్సి వస్తుంది అని అనుకోలేదు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీతో అనుబంధం ఉంది. దర్శకుడిగా నిర్మాతగా హీరోగా ఆయన తెలుగు చిత్రపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుమారుడు మహేష్ బాబుకి అలాగే కుటుంబ సభ్యులకు నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

  సాహసానికి మరో పేరు.. ఎన్టీఆర్

  సాహసానికి మరో పేరు.. ఎన్టీఆర్

  జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. కృష్ణ గారు అంటేనే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలు చేసిన ఆయన సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేశారు. మీ ఘనత ఎప్పటికీ చిరస్మరణీయం. ఈ సమయంలో మహేష్ బాబు అన్నకు అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. సూపర్ స్టార్ ఫరెవర్.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు.

  మాటలకు అందలేని విషాదం.. చిరంజీవి

  చిరంజీవి స్పందిస్తూ.. ఇది మాటలకు అందలేని విషాదం. ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం బాధాకరం. సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. ఆయన సాహసానికి ఊపిరి. ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం వీటి కలబోతే కృష్ణగారు. అటువంటి మహా మనిషి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారత సినిమా పరిశ్రమలో కూడా అరుదుగా ఉంటారు.

  ఇక తెలుగు సినిమా పరిశ్రమను సగర్వంగా తలెత్తుకోగలిగేలా అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రునివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. సోదరుడు మహేష్ బాబుకు ఆయన కుటుంబ సభ్యులందరికీ అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తున్నాను.

  English summary
  Tollywood celebrities condolences to super star ghattamaneni krishna death..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X